సరిగ్గా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగింపురోజే ఏపీలో ఐదు పోలింగ్ బూతుల్లో మరోసారి పోలింగ్ నిర్ణయించాలన్న ఈసీ నిర్ణయం వివాదాస్పదమైంది. ఈసీ వైసీపీకి అనుకూలంగా చర్యలు తీసుకుంటోందని టీడీపీ నేతలు ఘాటుగానే విమర్శిస్తున్నారు. ఏకంగా సీఎస్‌ను చెవిరెడ్డి సెక్రటరీ అనే రేంజ్‌కు వెళ్లిపోయారు. 


వాస్తవానికి సీఈసీ చర్యలు కూడా విమర్శలకు తావిచ్చేలాగానే ఉన్నాయి. పోలింగ్ జరిగిన నెల రోజుల తర్వాత ఇప్పుడు తాపీగా రీపోలింగ్ కు ఆదేశాలు ఇవ్వడం ఎవరికైనా అనుమానాలు కలగజేస్తోంది. అయితే ఈ విమర్శలపై సీఈవో ద్వివేదీ ఘాటుగానే స్పందించారు.  

చంద్రగిరి నియోజకవర్గంలో జరిగిన పోలింగ్ దృశ్యాలు చూస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్దం అవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. రీపోలింగ్ ఐదు బూత్ లలో పెట్టడం సమర్దనీయమేనని స్పష్టం చేశారు. వీడియో దృశ్యాలు చూస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమైందన్నారు. 

పోలింగ్‌లో అక్రమాలు జరిగినట్టు నిర్థారణకు వచ్చామని, పీవో, ఏపీవోలను సస్పెండ్‌ చేస్తున్నట్టు ద్వివేదీ చెప్పారు. రెండు సార్లు రీపోలింగ్‌ జరగకూడదని ఎక్కడైనా ఉందా? మా దృష్టికి వచ్చినప్పుడు అరాచకాలను పట్టించుకోకుండా పక్కన పెట్టాలా? అని ద్వివేదీ ఘాటుగానే ప్రశ్నించారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: