ఆంధ్రప్రదేశ్ లో మూడు నెలల క్రితం ఏపిలో ఎక్కడ చూసినా మైక్ లతో మోతలు మోగాయి.  ముఖ్య పార్టీ నేతలు తమ ప్రచారాలతో దుమ్మురేపారు.  గత నెల 11న పోలింగ్ జరిగింది..పోటీలో ఉన్న అందరు నేతలు ఎవరి గెలుపు పై వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.   ఎన్నికలు జరిగి నెల రోజులు దాటింది.  మరో ఐదు రోజుల్లో ఏపిలో రిజల్ట్ రాబోతుంది.  ఈ నేపథ్యంలో ముఖ్య పార్టీ నేతలు తమకు వచ్చే సీట్ల గురించి విశ్లేశించుకుంటున్నారు. 


కానీ, ఐతే, వైసీపీ అధినేత జగన్ మాత్రం ఇవేవీ చెయ్యలేదు. ఫలితాలు వచ్చాక చూద్దామన్నట్లు సైలెంట్‌గా ఉన్నారు.  ప్రధానంగా ఈ నెల రోజుల్లో జగన్ ఐదు రకాల సర్వేలు చేయించారని సమాచారం. రైతులు, మహిళలు, యువత, పట్టణ ప్రజలు, పల్లె జనం ఇలా ఎవరెవరు ఎవరికి ఓటు వేశారన్న అంశంపై వర్గాల వారీగా, కులాల వారీగా, మతాల వారీగా ఐదు రకాల సర్వేలు చేయించి, వాటన్నింటినీ జాగ్రత్తగా విశ్లేషించారని తెలుస్తోంది.


వైసీపీ జరిపించిన సర్వేలన్నింటినీ క్రోఢీకరిస్తే... ఆ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా 100 సీట్లు వస్తాయని తేలిందని సమాచారం. ఈ 101 సీట్లకు పైనే వస్తాయి తప్ప, ఒక్కటి కూడా తగ్గదని తేలడం వల్లే జగన్ పూర్తి సంతృప్తిగా ఉన్నారని తెలిసింది. అలాగే లోక్ సభ ఎన్నికల్లో మొత్తం 25 పార్లమెంటరీ స్థానాలుండగా... వైసీపీకి కచ్చితంగా 16 నుంచి 18 వరకు   సీట్లు దక్కుతాయని సర్వేల్లో తేలిదంట. ప్రస్తుతానికి ఏ పార్టీవారు ఆయా పార్టీల ప్రాదాన్యతకు తగ్గట్లుగా సర్వేలు చేయించుకుంటున్న విషయం తెలిసిందే. 


చిత్తూరు : 14 సీట్లకు 8 వైసీపీ,  
కడప : 9 వైసీపీ
కడప, చిత్తూరు కలిపి = 17 సీట్లు
కర్నూల్ : 10 వైసీపీ
అనంత పూరం : 7 వైసీపీ
కర్నూల్ , అనంతపూరం : 17 సీట్లు
నెల్లూరు : 8 వైసీపీ
ప్రకాశం జిల్లా : 8 వైసీ
నల్లూరు, ప్రకాశం జిల్లా : 17 
గుంటూరు : 8 వైసీపీ
కృష్ఱా జిల్లా :  8 వైసీపీ
గుంటూరు, కృష్ఱా జిల్లా : 16 సీట్లు
తూర్పు గోదావరి : 8 వైసీపీ
పశ్చిమ గోదావరి : 8 వైసీపీ 
తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి : 16 సీట్లు
వైజాగ్ : 6 వైసీపీ
విజయనగరం : 5 సీట్లు
వైజాగ్ ,విజయనగరం :  11 సీట్లు
శ్రీకాకుళం : 7 సీట్లు
మొత్తం వైసీపీ గెలవబోయే సీట్లు :  101 ఈ లెక్క


జనసేన 3 నుంచి 6 వరకు వచ్చే అవకాశం..ఇక మిగిలిన స్థానాలు టీడీపీ గెల్చుకోవొచ్చని ఆంధ్రప్రజ, కొన్ని ప్రముఖ సర్వేలు తెలుపుతున్నాయి. అయితే ఏపిలో వైఎస్ జగన్ పోటీ చేస్తున్న స్థానం నుంచి అత్యధిక ఓట్లు నమోదు చేసుకుంటారని.. చంద్రబాబు, బాలయ్య, లోకేష్ లకు వచ్చే మెజార్టీ కన్నా జగన్ కి ఒకింత ఎక్కువే మెజార్టీ వస్తుందని అంటున్నారు వైసీపీ శ్రేణులు. 


 సరిపల్లి నర్సారెడ్డి


మరింత సమాచారం తెలుసుకోండి: