Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Jun 26, 2019 | Last Updated 3:45 pm IST

Menu &Sections

Search

ఎడిటోరియల్ : ఆ 17 నియోజకవర్గాలపైనే వైసిపి గురి

ఎడిటోరియల్ : ఆ 17 నియోజకవర్గాలపైనే వైసిపి గురి
ఎడిటోరియల్ : ఆ 17 నియోజకవర్గాలపైనే వైసిపి గురి
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ఉండటానికి రాష్ట్రంలో 175 నియోజకవర్గాలున్నా వైసిపి మాత్రం 17 నియోజకవర్గాలపైనే తన దృష్టి పెట్టిందట.  ఈ నియోజకవర్గాల్లో వైసిపి గెలుపు ఖాయమని కాకపోతే తెలుగుదేశంపార్టీ ఏదో ఓ రకంగా కౌంటింగ్ రోజున తమ గెలుపును అడ్డుకునే ప్రయత్నాలు చేస్తోందని వైసిపి అనుమానిస్తోంది. అందుకనే ఆ నియోజకవర్గాలున్న జిల్లాల కలెక్టర్లతో పాటు చీఫ్ ఎలక్షన్ కమీషనర్ తో పాటు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా కలిసి ముందస్తు ఫిర్యాదులు చేసింది.

 

వైసిపి దృష్టి పెట్టిన ఈ నియోజకవర్గాల్లో రాయలసీమలో 6 నియోజకవర్గాలున్నాయి. రాజధాని జిల్లాలైన కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని 6 నియోజకవర్గాలు, విశాఖపట్నం జిల్లాలో 2, ఉభయ గోదావరి జిల్లాల్లో 3 నియోజకవర్గాలున్నాయి. ఈ నియోజకవర్గాల్లో తమ పార్టీ గెలుపు ఖాయమని వైసిపి అంచనాలో ఉంది. అయితే కౌంటింగ్ సందర్భంగా టిడిపి వెనకడినపుడు ఏదో ఒకరకంగా గొడవలు పెట్టుకుని కౌంటింగ్ ప్రక్రియకు ఆటంకం కలిగించాలని టిడిపి కుట్రలు పన్నుతున్నట్లు వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఆరోపిస్తున్నారు.

 

 

రాయలసీమలోని చంద్రగిరి, ఉరవకొండ, రాప్తాడు, ధర్మవరం, తాడిపత్రి, రాజంపేటలో గొడవలు జరుగుతాయని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అలాగే, రాజధాని జిల్లాల్లోని మంగళగిరి, గురజాల, చిలకలూరిపేట,  మైలవరం, గుడివాడ, గన్నవరం ఉన్నాయి. విశాఖపట్నం జిల్లాలోని గాజువాక, విశాఖ తూర్పు ఉన్నాయి. ఉభయగోదావరి జిల్లాల్లోని భీమవరం, తుని నియోజకవర్గాల్లో గొడవలు చేసేందుకు టిడిపి ప్లాన్ చేస్తున్నట్లు వైసిపి అనుమానిస్తోంది.

 

అందుకనే సమస్యాత్మక నియోజకవర్గాల్లో అదనపు బలగాలను మోహరించాలని రిక్వెస్ట్ చేసింది వైసిపి. అలాగే రీ పోలింగ్ సందర్భంగా చంద్రగిరి నియోజకవర్గంలో కూడా అదనపు బలగాలతో భద్రత కల్పించాలని కూడా కోరింది. విజయసాయిరెడ్డి  చెబుతున్న నియోజకవర్గాల్లో గెలుపు అవకాశాలు ఎక్కువగా వైసిపికే ఉన్నాయట. అందులో పరిటాల శ్రీరామ్, జేసి ప్రభాకర్ రెడ్డి, నారా లోకేష్, దేవినేని అవినాష్, యరపతినేని శ్రీనివాసరావు, దేవినేని ఉమా మహేశ్వరరావు, పవన్ కల్యాణ్ పోటీ చేసిన నియోజకవర్గాలుండటం గమనార్హం.

 

 


ycp-eyeing-on-17-segments
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
సంచలనం : ప్రజా వేదిక వివాదంలో ఊహించని ట్విస్ట్
బిగ్ బ్రేకింగ్ :   ఇల్లు ఖాళీ చేసేయాలని నిర్ణయించుకున్న చంద్రబాబు
ఎడిటోరియల్ :  జగన్ దెబ్బకు టిడిపి నేతల మైండ్ బ్లాంక్ ?
ఎడిటోరియల్ : నేటమట్టమైంది  ప్రజావేదిక కాదు..ముమ్మాటికి టిడిపి వేదికే
ఎడిటోరియల్ : మద్దతుదారులతో గంటా కీలక సమావేశం..పెరిగిపోతున్న టెన్షన్
కూలిన చంద్రబాబు కలలకోట...ప్రజావేదిక కూల్చివేత..కరకట్టపై ఉద్రక్తత
ఎడిటోరియల్ :  తమ్ముళ్ళ గోల వెనకున్న కథేంటో తెలుసా ?
ఆ పని చేయటం జగన్ కు అంత ఈజీ కాదు
ఎడిటోరియల్ : మొత్తానికి వాళ్ళు అవినీతిపరులని తేల్చేశారుగా !
ఎడిటోరియల్ : వంగవీటికి దిక్కు తెలీటం లేదా ?
ఎడిటోరియల్ : టిడిపి నేతల ఆదాయానికి జగన్ షాక్
టిడిపి సన్మానాన్ని తిరస్కరించిన మంత్రి
ఎడిటోరియల్ : జగన్ పాలనతో బెంబేలెత్తుతున్న టిడిపి
ఎడిటోరియల్ : అందుకేనా ఆ భవనాన్ని చంద్రబాబు ఖాళీ చేయంది ?
జగన్ కు పవన్ మద్దతు...టిడిపికి షాక్
టిడిపికి ఇంకా బుద్ధి రాలేదు..ఇంకా వంకర ఆరోపణలేనా ?
ఎడిటోరియల్ : ఫిరాయింపు ఎంపి వైఖరితో మండిపోతున్న బిజెపి
ఎడిటోరియల్ :  కూల్చివేతల్లో జగన్ నెక్స్ట్ టార్గెట్ అదేనా ?
సంచలనం : ప్రజావేదిక కూల్చివేతకు జగన్ ఆదేశాలు..చంద్రబాబుకు దిమ్మతిరిగే షాక్
ఎడిటోరియల్ : సుజనా బరితెగింపు
ఎడిటోరియల్ : దేశాభివృద్ధి కోసమే పార్టీ మారారట
ఎడిటోరియల్ : పార్టీలో చంద్రబాబు ఒంటరైపోయారా ? తమ్ముళ్ళ షాక్ ?
విజయసాయికి కీలక పదవి
ఎడిటోరియల్  : వైసిపి ఎంఎల్ఏల సంఖ్య పెరుగుతుందా ?
ఎడిటోరియల్ : సొంత మ్యాగజైన్ లోనే చులకనగా వార్తలా ?
ఎడిటోరియల్ :  ఈ విషయంలో జగన్ కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే
ఎడిటోరియల్ : అప్పుడు బాగా అతిచేశారు...ఇపుడు అల్లాడుతున్నారు
ఎడిటోరియల్ : టిడిపి నుండి రాజ్యసభకు పంపితే అంతే సంగతులు
ఎడిటోరియల్ :  చంద్రబాబు డేంజరస్ గేమ్....ఏపిలో కూడా సేమ్ టు సేమ్
ప్రజావేదిక స్వాధీనం...చంద్రబాబుకు మరో షాక్
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.