గత నెలలో 11వ తేదీన ఏపి మొత్తం పోలింగ్ జరుగుతుంటే..చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో మాత్రం అల్లర్లు జరిగాయి.  ముఖ్య పార్టీ నేతలు నువ్వా అంటే నువ్వా అనే విధంగా కార్యకర్తలతో పెద్ద యుద్దమే జరిగేలా చేశారు.  మొత్తానికి చంద్రగిరి నియోజకవర్గంలో మరో సారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.  దాంతో అక్కడ ఎన్నికలు వాయిదా పడ్డాయి.

  నియోజకవర్గ పరిధిలోని రామచంద్రపురం మండలం కుప్పం బాదూరు, కాలేపల్లిలోని పోలింగ్‌ కేంద్రాల్లో రీపోలింగ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. దీంతో రీపోలింగ్‌కు ఓవైపు చురుకుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. 

మరోవైపు కుప్పం బాదూరులో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.  ఈ నేపథ్యంలో రేపు పోలింగ్ సందర్భంగా అక్కడి పరిస్థితులను గమనించేందుకు..చేసేందుకు కుప్పం బాదూరు వెళ్లారు.. చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని... కానీ, ఆయన ప్రచారానికి రాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు.

  దాంతో వైసీపీ నేతలతో టీడీపీ నేతలు బాహాబాహికి దిగారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా మోహరించారు పోలీసులు. 


మరింత సమాచారం తెలుసుకోండి: