లగడపాటి రాజగోపాల్ రెడ్డి ఎన్నికల ముందు పెద్ద మేధావి మాదిరిగా సర్వే ఫలితాలు చెప్పడం మనం చూస్తూనే ఉన్నాము. ఒక పక్క నాకు ఏ రాజకీయ పార్టీతో సంభందం లేదంటూనే తన కుల పిచ్చి వదిలిపెట్టలేదు.  ఏపీ జనాలు సైకిల్ ను ఎంచుకున్నారని ఈయన వ్యాఖ్యానించారు. తద్వారా రేపు తను ఏం చెప్పబోతున్నట్టో ఈ రోజే తెలియచెప్పారు. 'తెలంగాణ రాష్ట్రం పరిస్థితి దర్జాగా ఉంది అక్కడ ప్రజలు కారును ఎంచుకున్నారు. ఏపీ రాష్ట్ర పరిస్థితి బాగోలేదు కాబట్టి అక్కడి ప్రజలు సైకిల్ ను ఎంచుకున్నారు…' అన్నట్టుగా పెద్ద తత్వవేత్తలా చెప్పారీయన.


అయితే ఇది ఈ విశ్లేషణ ఏ మాత్రం వాస్తవానికి దగ్గరగా లేదని మాత్రం కచ్చితంగా చెప్పవచ్చు. ఏపీ ఆర్థిక పరిస్థితి బాగోలేదు  అని చంద్రబాబు నాయుడు ఎక్కడా ఫీలవ్వలేదు. ఇష్టానుసారం విలాసాలకు పోయారు. విమానాలు, విదేశీ పర్యటనలకు కొదవలేదు. ఆయన కుటుంబం బస ఐదుకు మించిన నక్షత్రాల హోటల్లో. ఆ విషయాలు అన్నీ ప్రజలకు తెలియనివీ ఏమీ కాదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏం బాగోలేదు.. చంద్రబాబు నాయుడే దాన్ని ఉద్ధరిస్తున్నాడు అనే ఫీలింగ్ ఐదేళ్ల పాలనలో ఎక్కడా కలగలేదు!


రాష్ట్రం ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా చంద్రబాబు నాయుడు విలాసాలకు పోతున్నాడు అనే భావనే సర్వత్రా కలిగింది. పోలింగ్ ముగిసిన ఏపీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడి పార్టీ గెలవబోతోందని చెప్పడానికి వేరే రీజన్లను ఏమైనా చెప్పుకోవచ్చు. తెలుగుదేశమే గెలుస్తోందని లగడపాటి చెప్పాలనుకుంటున్నాడు కాబట్టి దానికి వేరే రీజన్లు చెప్పుకోవచ్చు. తెలుగుదేశం వాళ్లు చెబుతున్నట్టుగా ఏ 'పసుపు- కుంకుమ' రక్షిస్తుందని చెప్పవచ్చు. అదెలా ఉంటుందో ఫలితాలతో తేలిపోతుంది. ఆల్రెడీ లగడపాటి సర్వేలకు ఉన్న విశ్వసనీయత ఏ పాటిదో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలప్పుడే తేలిపోయింది. ఇంకా బ్యాలెన్స్ ఏదైనా ఉంటే.. ఏపీ ఎన్నికలతో వైట్ వాష్ కాబోతోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: