ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఏది అంటే భారతదేశం అనే చెప్తాం.  దేశంలో జరిగే సార్వత్రిక ఎన్నికలపై ప్రపంచ దేశాల దృష్టి సారిస్తాయి.  ఎందుకంటే ఇప్పుడు ఇండియా ఎదుగుతున్న దేశం కాబట్టి.  అందరి చూపులు ఇండియావైపే ఉంటాయి.  పైగా ఆర్ధికంగా ఇండియా చాలా బలంగా మారిపోయింది.  మోడీ ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చాక ప్రపంచ దేశాలతో దౌత్యపరమైన అనుబంధాలు ఏర్పరుచుకుంది.  కావలసిన వాటిని ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకునే మనం.. మేక్ ఇన్ ఇండియా పేరుతో మనదగ్గరే వస్తువులు తయారుచేసుకోవడం మొదలుపెట్టాం.  


అంతరిక్ష రంగంలోను, రక్షణ రంగంలోనూ ఇండియా బలీయంగా ఎదగడం చాలా దేశాలకు మింగుడు పడని విషయంగా మారింది.  అందుకే అందరూ ఇండియా వైపు చూస్తున్నారు.  ఇండియాలో ఎన్నికలు జరిగే సమయంలో రాబోయే ప్రభుత్వాల గురించి విదేశీయులు సైతం సర్వేలు చేయించుకుంటుంటారు. 


సాదారణంగా దేశంలో జరిగే సార్వత్రిక ఎన్నికలు 10 లేదంటే 15 రోజుల్లోపే ముగుస్తుంటాయి.  కానీ, ఈసారి ఎన్నికలు 40 రోజులపాటు జరిగాయి.  ఏడు దశల్లో జరిగిన ఈ ఎన్నికలు, ప్రతి ఫేజ్ మధ్య చాలా గ్యాప్ వచ్చింది.  ఇంతటి గ్యాప్ ఉండటం కొంత ఇబ్బందికరమైన అంశమే.  ఇంతటి గ్యాప్ తీసుకుంటే... పాలనాపరమైన సమస్యలు కూడా తలెత్తవచ్చు.  ప్రజల్లో ఆ ఉత్కంఠత తగ్గిపోతుంది.  నాయకుల్లో సైతం టెన్షన్ పెరిగిపోతుంది.  


నితీష్ కుమార్ వంటి ముఖ్యమంత్రి ఎన్నికల గ్యాప్ విషయాన్ని ప్రశ్నిస్తున్నారంటే అర్ధం చేసుకోవచ్చు.  నేటితో చివరిదశ ఎన్నికలు ముగియనున్నాయి.  ఈ ఎన్నికల తరువాత, ఈరోజు సాయంత్రం ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెలువడుతాయి.  అనంతరం మే 23 వ తేదీన తుదిఫలితాలు వెలువడుతాయి.  ఈసారి ఎన్నికల కౌంటింగ్ త్వరగానే ప్రారంభమైన... చివరి ఫలితాలు మాత్రం ఆలస్యం అయ్యేవిధంగా కనిపిస్తోంది.   


మరింత సమాచారం తెలుసుకోండి: