పుట్టు జమీందార్ , చేతి సంచిలో ఉన్న రెండు జతల బట్టల్ని మాత్రమే మిగిల్చుకున్నారీయన తన అంత్య దశలో. మిగిలిందంతా సమాజానికే ఇచ్చేసారీ మనీషి. సమాజమే తన కుటుంబమని... వత్సరాల తరబడి తనను ఘాఢంగా ప్రేమించిన వ్యక్తిని కూడా... కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న తరువాతే భార్యగా స్వీకరించారు.

హార్ధిక సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలైన ఇప్పటి కాలంలో... ఈ మనీషి ని తిక్కలోడు, పిచ్చోడు అనే అనుకుంటారేమో. కానీ గతం లేని వర్తమానం ఉండజాలదు. సొంతమేల్ కొంతమానుకుని పొరుగువారికి సాయపడి మన పెద్దలు సమాజంలో మనకీ , మన జాతికీ కీర్తిని ఆర్జించి వెళ్ళారు. 


ఈరోజు మన జాతికి ఉన్న పేరు, ప్రతిష్ఠ, మన పట్ల వివిధ జాతుల వారికి ఉన్న నమ్మకం... ఇవన్నీ, కొన్ని తరాల పాటు మన పెద్దలు చేసిన త్యాగాలు, కష్ఠాలు, ఓర్చుకున్న భాధలు... మనం ఇంత ఘనం చేయకున్నా మనకింత చేసిన వారిని మరవకుండా సాధ్యమైనంత వరకూ మన భావితరాల వారు కూడా తలెత్తుకుని జీవించే విధంగానన్నా బ్రతకడం మన కనీస భాధ్యత. 


700/- రూపాయల జీతంతో జీవితం మెదలుపెట్టిన నాటినుండి - నేటి కోట్ల విలువ వరకూ...  మా అంతకు మేము, మా కుటుంబముల మదీయ ఆర్జితములో 33% సంఘానికి, 33% మమ్మల్ని నమ్ముకుని ఉన్న ఉద్యోగానుచర, శ్రేయోభిలాషులకు కేటాయించి గత రెండు దశాబ్దాలుగా అమలు పరుస్తున్నాము.


శ్రీ. కోటి రెడ్డి సరిపల్లి,
వ్యవస్ధాపక అధ్యక్షులు, కోటి గ్రూప్.
భారత ప్రధాని అవార్డు పొందిన సంస్ధ


మరింత సమాచారం తెలుసుకోండి: