ఓటేసిన సామాన్యుడు ఏవరూ నేను వేసిన ఓటు వేరెవరికో పడింది” అని అనలేదు. కాని నలభై సంవత్సరాల సుధీర్ఘ రాజకీయ అనుభవంతో పాటు ఏడు దశాబ్ధాల వయసున్న రాజకీయ (వి) అఙ్జాని మాత్రం నేనేసిన ఓటు నా పార్టీకే పడిందన్న నమ్మకం లేదని-అదీ ఒక లా మేకర్ అనటం ఆయన మానసిక ధౌర్భాగ్యాన్ని దౌర్భల్యాన్ని వివేక శూన్యతను సూచిస్తుంది. 
Image result for chandrababu stands at the threshold of sonia rahul
కేంద్రంలో ప్రభుత్వంతో మనకు వ్యక్తిగత విబేధాలు ఉండవచ్చు కాని దానిని అడ్డుపెట్టుకొని రాజ్యాంగ వ్యవస్థలపై దాడి జరుగుతుందనటం చాలా అన్యాయం. అంతే కాదు సాంకేతిక పరిఙ్జానాన్ని భారత్ కు పరిచయం చేశానని పదే పదే చెప్పుకునే ఆయన అలా ఈవియంలపై వివిప్యాట్ లపై నిందలేయటం అత్యంత ధారుణం. ఈ దేశం కాంగ్రెస్ పాలనలో ఒకసారి గాఢాంధకారాన్ని, చీకటి రోజులని "అత్యయక పరిస్థితి" లేదా ఎమర్గెన్సీ పేరుతో చవి చూసింది. తరవాత అదే పార్టీ మొత్తం ఏడు దశాబ్ధాలు కేంద్రంలోనో రాష్ట్రాలలోనో ఎక్కడో కనీసం ఒక చోటనో రాజ్యపాలనం చేస్తూనే ఉంది.  అంటే కాంగ్రెస్ ఒకనాడు అన్నీ వ్యవస్థలను నిర్వీర్యం చేసిందనే కదా అర్ధం. ఎమర్గెన్సీ రోజుల్లో కాంగ్రెస్ అదే డైనాస్టీ పార్టీలో ఒక ప్రముఖ పాత్రధారి గానే ఉన్నారు కదా! చంద్రబాబు నాయుడు. 


ఆ తరవాత తనకు పిల్లనిచ్చిన మామ కాంగ్రెస్ వ్యతిరేక్షత, తెలుగు ప్రజల ఆత్మ గౌరవ పునాదుల పై నిర్మించిన తెలుగుదేశం పారీలో చేరి ఆపై “జామాత… దశమ గ్రహ పాత్ర” పోషించి తెలుగు దేశం పార్టీలో "వెన్నుపోటు" రాజకీయానికి తెరలేపి స్వంత మామనే మానసిక హింసకు గురిచేసి ఆయన అంతానికి ముందే టిడిపిని హైజాక్ చేసి అధికారం చేజిక్కించుకున్న కాలం నుండి చంద్రబాబుకు అధికారమే పరమావధిగా జీవించారు. 
Image result for chandrababu stands at the threshold of sonia rahul
2014 లో విధిలేని పరిస్థితుల్లో బిజేపితో పోత్తు పెట్టుకొని దాదాపు నాలుగేళ్ళ పాటు సోనియా గాంధిని “ఇటలీ మాఫియా,రాక్షసి” అంటూ, రాహుల్ గాంధిని “అఙ్జాని, పప్పు” అంటూ విమర్శలు చేసిన చంద్రబాబు నేడు మళ్ళీ కాంగ్రెస్ పంచన చేరటం సోనియా గాంధి దర్శనం దొరకక అలమటించటం చూస్తుంటే తెలుగువారి ఆత్మ గౌరవాన్ని దేశానికి ఎమర్జెన్సీ దుర్మార్గాన్ని రుచి చూపించిన డైనాస్టీ కుటుంబానికి సమర్పించటానికి సిద్ధమైన చంద్రబాబు తెలుగుదేశమే కాదు తెలుగువారి పాలిటి దుష్టగ్రహమని చెప్పటానికి సందేహించవలసిన అవసరం లేదు.   


టీడీపీ అధినేత ఏపీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పరిస్థితి ఇప్పుడు నిజంగానే చాలా దారుణంగా ఉందని చెప్పక తప్పదు. ఏపీలో జరిగిన ఎన్నికల్లో బాబు పార్టీ పెద్దగా రాణించలేదని సర్వేలు కోడై కూస్తున్న వేళ, ఏం చేయా లో దిక్కుతోచని చంద్రబాబు, ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. అదేమంటే, కేంద్రంలో మరోమారు మోదీని ప్రధాని కాకుండా చేయాలని కంకణం కట్టుకున్న చంద్రబాబు, ఆ దిశగా బీజేపీ యేతర పార్టీలను ఒక్కదరికి చేరుస్తున్నారట. సరే, రాజకీయంగా తన ప్రత్యర్థులకు అందలం దక్కకుండా చేయడమనేది పెద్దగా తప్పుబట్టాల్సిన అంశమైతే కాదు గానీ, ఆందు కోసం ఇప్పుడు చంద్రబాబు పడుతున్న పాట్లు చేస్తున్న ఫీట్లు చూస్తుంటే, నిజంగానే జాలి వేయక మానదు.
Image result for sonia neglects chandrababu
ఎందుకంటే, తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని ఆత్మాభిమానాన్ని అపహాస్యం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడమే లక్ష్యంగా పుట్టిన పార్టీ టీడీపీ. అలాంటి పార్టీని ఆ ఆపార్టీ అధ్యక్షుడు చంద్రబాబు తన స్వప్రయోజనాల కోసం అదే కాంగ్రెస్ పార్టీతో జట్టు కట్టేలా చేశారు. నరేంద్ర మోదీని ప్రధానిని కాకుండా చూడటం కంటే కూడా ఎక్కడ తాను దెబ్బైపోతానోనన్న భయమే చంద్ర బాబును బాగానే పట్టి పీడిస్తోందని చెప్పక తప్పదన్న వాదన వినిపిస్తోంది. 


ఈ క్రమంలో ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల కీలక ఘట్టమైన పోలింగ్ ముగిసిన వెంటనే ఢిల్లీకి విమానం ఎక్కుతూ దిగుతూ తనది కాని చోట పిలవని పేరంటానికి పేరంటాళ్ళా పోతూ నానా హడావిడి చేస్తున్న చంద్రబాబు, ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీతో ఇప్పటిదాకా కలవనే లేకపోయారట. ఇన్నిసార్లు ఢిల్లీకి వెళుతున్న చంద్రబాబు, ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో పలుమార్లు సమావేశం అయ్యారు. అయితే సోనియా గాంధి తో మాత్రం ఆయన ఇంతవరకు వ్యక్తిగతంగా కలిసి మాట్లాదింది లెదని సమాచారం. నిన్న కూడా ఢిల్లీలో వీధుల్లో ఆ గదప ఈ గదప ఎక్కుతూ దిగుతూ తిరిగిన చంద్రబాబు,  రాహుల్ గాంధీతో పాటు శరద్ పవార్ సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి లతో కూడా సమావేశం అయ్యారు. ఆ తర్వాత లక్నో వచ్చి అఖిలేశ్ యాదవ్, మాయావతి లను కలిశారు. 
Image result for chandrababu stands at the threshold of sonia rahul
ఆ తర్వాత విజయవాడ తిరిగి రావాల్సిన ఆయన అప్పటికప్పుడు తన టూర్ ప్రణాళిక ను మళ్లీ ఢిల్లీకే మార్చేశారు. అఖిలేశ్ యాదవ్ మాయావతిలతో జరిపిన చర్చల సారాంశాన్ని రాహుల్ గాంధికు వివరించేందుకే మరో మారు చంద్రబాబు మరోమారు ఢిల్లీ వెళ్లారని అంతా అనుకున్నారు. అయితే రెండో సారి చంద్రబాబు ఢిల్లీ వెళ్లింది రాహుల్ గాంధితో భేటీకి కాదట. సోనియా గాంధి కరుణిస్తే, ఆమెతో సమావేశం కోసమేనట. అయినా ఇన్ని సార్లు ఢిల్లీ వెళుతున్న చంద్రబాబు, ఇప్పటిదాకా సోనియా గాంధి ఒక్కసారి కూడా కలవలేక పోయారంటే చంద్రబాబు పై సోనియా తీరు ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఇప్పుడు కూడా చంద్రబాబుకు సోనియా అపాయింట్మెంట్ దక్క లేదట.


ఏమో! అఖిలేశ్ - మాయావతిలతో భేటీ అయ్యాను కదా! ఇప్పుడైనా సోనియా గాంధి కరుణించక పోతుందా అనుకుంటూ 10 జనపథ్ ముందు తచ్చాడుతున్నారట. మరి ఈ సారైనా సోనియ మాత కరుణిస్తుందో లేదో? ఈసారి కూడా చంద్రబాబు నిరాశ తోనే వెనుదిరుగుతారో? లేదో చూడాలి!
 Image result for chandrababu stands at the threshold of sonia rahul


ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో ఎట్టకేలకు భేటీ అయ్యారు. తొలిసారి ఆయన సోనియా గాంధితో ముఖా ముఖి అయ్యారు. ఎన్నికల అనంతరం ఫలితాలు, పరిణామాలపై చర్చిస్తున్నారు.  సోనియా గాంధి తో చంద్రబాబు నాయుడు భేటీ తో ఆయన ఆయన పార్టీ తెలుగుదేశం పతనం సంపూర్ణం అని చెప్పొచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: