ప్రకాశం దర్శి జూనియర్ కాలేజీ చెత్తకుప్పలో వీవీప్యాట్ స్లిప్పులు కనిపించడంతో ఒక్కసారిగా కలకలంరేగింది. దాదాపు 40 రోజుల సమయం తర్వాత ఇవి బయటపడటంతో స్థానికులు స్థానిక అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.  ఎన్నికలు ముగిసిన 45 రోజుల తర్వాత చెత్త కుప్పలో స్లిప్పులు కనిపించడం అనుమానాలకు తావిస్తోంది. దీనిపై అధికారులు స్పందించారు. అవన్నీ మాక్ పోలింగ్ స్లిప్ లే అని చెప్పారు. పోలింగ్ రోజున ముందుగా అధికారులు మాక్ పోలింగ్ నిర్వహిస్తారు.


ఈవీఎంల పని తీరుని పరీక్షిస్తారు. మాక్ పోలింగ్ సమయంలో వచ్చిన వీవీ ప్యాట్ స్లిప్పులను అధికారులు భద్రంగా ఉంచాలి. ఈవీఎంలతో పాటే వాటిని కూడా స్ట్రాంగ్ రూమ్స్ కు తరలించాలి. కానీ ఈ వ్యవహారం బట్టి చూస్తే అలా జరిగలేదని తెలుస్తుంది.  అయితే ఈ విషయం పెద్దగా పట్టించుకునే అంశమే కాదని, మాక్ పోలింగ్ సమయంలోనివని తేలిగ్గా కొట్టిపారేశారు. సరిగ్గా కౌంటింగ్‌కు నాలుగు రోజుల ముందు బయటపడటంతో  అందరూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు.  మరోవైపు ఎన్నికల సిబ్బంది వ్యవహార శైలిపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. 

ఈవీఎంలతో పాటే వాటిని కూడా స్ట్రాంగ్ రూమ్స్ కు తరలించాలి.  అయితే దర్శిలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. చెత్తకుప్పలో వీవీ ప్యాట్ స్లిప్పులు వెలుగుచూడటం కలకలం రేపింది. ఈ విషయాన్ని అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై కలెక్టర్ వివరణ కోరినట్టు సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: