దేశ వ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా..ఏ టీవి ముందు కూర్చున్నా..సోషల్ మీడియాలో మొత్తం దేశంలో సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ హడావుడి మొదలైంది.  మే 23న ఎన్నికల ఫలితాలు రాబోతుండగా... అంతకంటే నాలుగు రోజుల ముందుగా వివిధ ఛానెళ్లు, మీడియా, సర్వే సంస్థల ఎగ్జిట్ పోల్స్ రాబోతున్నాయి. అవి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి.  ఐతే... 2004 లోక్‌సభ ఎన్నికలు జరిగినప్పుడు వాజ్‌పేయి అధ్యక్షతన బీజేపీ అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. తీరా చూస్తే, సోనియా గాంధీ నేతృత్వం లోని యూపీఏ అధికారంలోకి వచ్చింది.   

2014లో... ఈసారి కచ్చితంగా NDA కూటమి గెలుస్తుందని చెబితే... డైరెక్టుగా బీజేపీయే 282 సీట్లతో పూర్తి మెజార్టీ దక్కించుకుంది. ఒక్క టుడేస్ చాణక్య సంస్థ మాత్రమే ఇదే ఫలితాన్ని ఊహించగలిగింది. ఆ సంస్థ NDAకి 326-354 మధ్యలో సీట్లు వస్తాయని చెప్పింది. నిజంగానే 336 సీట్లు వచ్చాయి. దీన్ని బట్టీ మనకు అర్థమయ్యేది ఒకటే. ఎగ్జిట్ పోల్స్ అనేవి మన టెన్షన్‌ను కాస్త తగ్గించడానికీ, మనం ఓ రెండ్రోజులు  టెన్షన్ పెట్టడమే అని తెలుస్తుంది.  తాజాగా రిపబ్లిక్ సీ ఓటర్స్ ఎగ్జిట్ పోల్ అంచనాల ప్రకారం బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమికి 287 స్థానాలు, కాంగ్రెస్ ప్రాబల్యం ఉన్న యూపీయే కూటమికి 128 స్థానాలు వస్తాయని అంచనా వేశారు.

ఇక న్యూస్ ఎక్స్ జాతీయ మీడియా చానల్ తన ఎగ్జిట్ పోల్స్ లో ఎన్డీయేకి 298 స్థానాలు, యూపీఏకి 118, ఇతరులు 126 స్థానాల్లో గెలవబోతున్నట్టు పేర్కొంది. దాదాపు ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఎన్డీయే వైపే మొగ్గుచూపుతున్నట్టు ట్రెండ్స్ చూస్తే అర్థమవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: