ఏపీలో ఎవ‌రు గెలుస్తార‌నే అంశంపై ఎగ్జిట్స్ పోల్స్ ఫ‌లితాల్లో విప‌క్ష వైసీపీ బంప‌ర్ మెజార్టీల‌తో దూసుకుపోతోంది. పీపుల్‌ పల్స్‌ సర్వేలో వైఎస్సార్‌సీపీ ప్రభంజనం సృష్టించింది. ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలు ఉండ‌గా వైసీపీ ఏకంగా 112 సీట్ల‌తో స్ప‌ష్ట‌మైన మెజార్టీ సాధిస్తుంద‌ని పీపుల్స్ ప‌ల్స్ స‌ర్వే స్ప‌స్టం చేసింది. ఇక అధికార టీడీపీ 59 స్థానాల్లో గెలుపొందే అవకాశమున్నట్లు తెలిపింది. ఏపీలో ఏ పార్టీ అయినా అధికారంలోకి వ‌చ్చేందుకు సాధార‌ణ మెజార్టీ 88 స్థానాలు.


వైసీపీ సాధార‌ణ మెజార్టీని క్రాస్ చేసి ఏకంగా 112 సీట్లు సాధిస్తుంద‌ని ఈ స‌ర్వే తెలిపింది. ఇక ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్‌ జనసేన పార్టీ 4 స్థానాల్లో విజయం సాధించవచ్చునని పేర్కొంది.ఇక ఎంపీ సీట్ల విష‌యానికి వ‌స్తే వైసీపీ 18 నుంచి 21 స్థానాలు గెలిచే అవకాశముందని, టీడీపీకి 4 నుంచి 6 స్థానాలు వస్తాయని చెప్పింది. 25 ఎంపీ సీట్ల‌లో వైసీపీ ఏకంగా 18-21 సీట్లు అంటే మామూలు విష‌యం కాదు. ఈ లెక్క‌న ఏపీ ప్ర‌జ‌లు జ‌గ‌న్‌కు ఎంత భారీ మెజార్టీతో ప‌ట్టం క‌ట్ట‌బోతున్నారో ?  స్ప‌ష్టంగా తెలుస్తోంది.


ఇక ఓటింగ్ శాతం విష‌యానికి వ‌స్తే వైసీపీకి 45.4 శాతం ఓట్లు, టీడీపీకి 42.3 శాతం, జనసేనకు 8.4 శాతం, ఇతరులకు 3.9 శాతం ఓట్లు రావచ్చునని వెల్లడించింది. వైఎస్సార్ క‌డ‌ప జిల్లాలో టీడీపీ ఖాతా తెరవక పోవచ్చునని, అలాగే జనసేనకు 10 జిల్లాల్లో ఒక్క సీటు కూడా రాకపోవచ్చునని సర్వే ద్వారా చెప్పింది. జనసేనకు పశ్చిమ గోదావరిలో రెండు, తూర్పుగోదావరి, విశాఖపట్నంలో ఒక్కో సీటు గెలిచే అవకాశముందన్నారు. చాలా స‌ర్వేలు జ‌న‌సేన‌కు 0-1 సీటు మాత్ర‌మే వ‌స్తుంద‌ని ఇస్తే ఈ స‌ర్వే మాత్రం ఈ స‌ర్వే 6 స్థానాల వ‌ర‌కు ఇవ్వ‌డం గొప్ప విష‌య‌మే.


మరింత సమాచారం తెలుసుకోండి: