Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, Jun 24, 2019 | Last Updated 6:48 pm IST

Menu &Sections

Search

లగడపాటి సర్వేలో సైకిల్ దే హావా

లగడపాటి సర్వేలో సైకిల్ దే హావా
లగడపాటి సర్వేలో సైకిల్ దే హావా
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ తాజా సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఫలితాలపై  తన సర్వే వివరాలను వెల్లడించారు.చాలా రోజుల తర్వాత తిరుపతిలో వెంకటేశ్వరస్వామి సన్నిధిలో ఫలితాలు వెల్లడించే అవకాశం వచ్చిందన్నారు. ఈ ఎన్నికల్లో ఏపీ ఓటర్లు సైకిల్‌, తెలంగాణ ఓటర్లు కారు ఎక్కారని నిన్న వెల్లడించిన ఆయన ఈ రోజు అంకెలతో కూడిన ఎగ్జిట్‌పోల్స్‌ను ప్రకటించారు. ఈసారి ఎన్నికల్లో ఏపీలో త్రిముఖ పోరు జరిగినప్పటికీ తెదేపాదే గెలుపు అని స్పష్టంచేశారు. ఏపీలో వైకాపా గట్టిపోటీ ఇచ్చిందని తెలిపారు. తాజా ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి 100 స్థానాలకు పది అటో ఇటో స్థానాలు వస్తాయని వెల్లడించారు. వైకాపాకు 72కు 7 సీట్లు అటో ఇటో వస్తాయని తెలిపారు. జనసేన, ఇతరులకు మూడు సీట్లకు రెండు సీట్లు అటూఇటుగా వస్తాయని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. 

కేవలం రెండు శాతం ఓట్లు మాత్రమే రెండు పార్టీల మధ్య ఉంటుందని అన్నారు. తెదేపాకు ఇంచుమించు 43 శాతం ఓట్లు వస్తాయని, వైకాపాకు 41శాతం, జనసేనకు 11శాతం ఓట్లు వస్తాయని అంచనా వేశారు. ఈ ఓట్ల శాతంలో ఒక శాతం అటూఇటుగా ఉంటుందని చెప్పారు. ఏపీలో లోక్‌సభ స్థానాలపై మాట్లాడుతూ.. తెదేపాకు 15 సీట్లకు రెండు అటుఇటుగా, వైకాపాకు  10కి రెండు అటుఇటుగా స్థానాలు రావొచ్చని లగడపాటి అంచనావేశారు. జనసేన, ఇతరులకు సున్నా నుంచి ఒక లోక్‌సభ స్థానం వచ్చే అవకాశం ఉన్నట్టు తమ సర్వేలో తేలిందన్నారు.  


కేంద్రంలో ఈసారి హంగే?
తన మిత్రులు చెప్పిన సమాచారం ప్రకారం.. ఈసారి కేంద్రంలో హంగ్‌ వస్తుందని లగడపాటి వెల్లడించారు. మెజార్టీలో దగ్గరిగా వచ్చి ఎన్డీయే ఆగిపోతుందన్నారు. కేంద్రంలో వచ్చే ప్రభుత్వంపైనే ఏపీ భవిష్యత్తు ఆధారపడి ఉందని, ఏపీలో పార్టీలకు వచ్చే సీట్లపై ఆధారపడే ప్రభుత్వం కేంద్రంలో వస్తే ఏపీ ప్రజల కోరికలు నెరవేరుతాయన్నారు. లేకపోతే మళ్లీ పోరాటం తప్పదని చెప్పారు. కేంద్రంలో ఆయా కూటమిలలోని పార్టీలకు మధ్య మెజార్టీ ఎంత ఉంటుందనేది ఈనెల 23నే తేలుతుందన్నారు. అనేక ఫ్రంట్‌లకు ప్రయత్నాలు జరుగుతున్న వేళ ఎవరు అధికారంలోకి వస్తారనేది ఆసక్తికరంగా మారింది.


తెలంగాణలో కారుదే జోరు!

తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. మా సంస్థ జనవరి నుంచి ఎన్నికల ముందు, తర్వాత నెలనెలా రాష్ట్రంలో పరిస్థితులపై అధ్యయనం చేసింది. ప్రజల నాడి ఏంటి? మనోగతం ఎలా వుంది? తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత వారి ఆలోచనల్ని క్షుణ్నంగా పరిశీలించాం. లోతుగా పరిశీలించి నివేదిక మా సంస్థ అందజేసింది. శాస్త్రీయంగా జరిగిన ప్రక్రియ ఇది. ఏ పార్టీతో మాకు సంబంధంలేదు. ఏపీలో మా అంచనా ప్రకారం తెలంగాణలో తెరాసకు 14 నుంచి 16 లోక్‌సభ స్థానాలు, కాంగ్రెస్‌కు 0 నుంచి 2 వరకు వస్తాయి. ఒక సీటు ఎంఐఎంకు వస్తుంది.  ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికలు కలిసి వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. ఏపీలో అధికారం తెదేపాదే.  ఇప్పుడున్న తెదేపా ప్రభుత్వమే మళ్లీ అధికారంలోకి రాబోతోంది. తెదేపా రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వస్తే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగతాయని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ప్రధాన ప్రతిపక్షంగా వైకాపా గట్టిపోటీ ఇచ్చింది. హోరా హోరీగా ఎన్నికల ప్రచార సభలు జరిగాయి. అధికారంలోకి రాకపోయినా గణనీయమైన ప్రజామద్దతుతో జగన్‌ సారథ్యంలో వైకాపా గట్టిపోటీ ఇచ్చింది. మూడో స్థానంలో పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ నిలుస్తారు’’ అని లగడపాటి వివరించారు.
rajagopal
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్న షారుక్ కుమార్తే
లండన్ నుంచి వచ్చిన మహేష్
ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ రాజీనామా..!
బాలీవుడ్ సినిమాలకు సై చెబుతున్న పూజ
రెండు రాష్ట్రాలు సానుకూలమే...
చంద్రబాబు నివాసంలో టీడీపీ నేతల సమావేశం
కల్కి చిత్రం నుంచి 'ఎవరో ఎవరో' పాట విడుదల
గ్లామర్ డోస్ పెంచిన రాశీఖన్నా... ఎందుకంటే ?
జూలై 18న ‘రాక్షసుడు’ వస్తున్నాడు...
శాలినిపాండే కల నిజం అవుతుందా..?
వర్షం పడింది... మెట్రోకు కాసుల కురిపించింది
కియారా ప్రేమించిందటా..!
20రోజుల పాటు నగ్నంగా నటించిన అమలపాల్
గ్రామ వాలంటీర్ల విధులు ఏమిటంటే..?
గ్రామ వాలంటీర్లకు ఎంపిక విధానం ఇలా!
నెటిజన్లకు నెహాశర్మ హాట్ ఎగ్జిబిషన్
ఆగస్టు 15 నుంచి అందుబాటులో గ్రామ వాలంటీర్లు... జీవో విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం
గత అవినీతిపై విచారణ చేస్తాం... టీటీడీ నూతన చైర్మన్ సుబ్బారెడ్డి
‘ఇస్మార్ట్ శంకర్’ విడుదల వాయిదా... కారణం ఏమిటంటే..?
దిల్ రాజును టీటీడీలో నియమించిన జగన్..?
జల వివాదాల పై 27న సీఎంల సమావేశం
మోడల్ ను బైటకు తీసిన ఊర్వశి
నేడు తెలంగాణకు జగన్ షెడ్యూల్
దారి చూపించిన ఎంపీ కేశినేని
ఆ నలుగురిపై మాజీ మంత్రి ఉమా ఆగ్రహం
ఆ నలుగురి చేరికపై ఆగ్రహం వ్యక్తం చేసిన బాబు
నయనకు మరో తలనొప్పి
ఉత్తమ్ కు కోమటిరెడ్డి గుట్టు
కమ్యునిటీ వర్కర్లకు జీతాలు పెంచిన డిప్యూటీ సీఎం
బలం పెంచుకునేందుకు బీజేపీ వ్యూహం
టీడీపీ ఎంపీ గరికపాటికి అస్వస్థత
విజయవాడ కృష్ణా నది లో ప్రారంభమైన వరుణ యాగం
టీడీపీ నేతలతో తోట త్రిమూర్తులు భేటీ...?!
వైరల్ గా ఊర్వశీ - కోహ్లీ హగ్ ఫోటో
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.