పోలింగ్ ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ కుప్పలు తెప్పలుగా వచ్చి పడ్డాయి. అందరూ అనుకున్న విధంగా వైస్సార్సీపీ ప్రభంజనం ఖాయమని తెలిసిపోయింది. కేంద్రంలో ఎన్డీయే హవా కొనసాగానున్నదని చెప్పాయి. ఇక ఏపీ విషయానికి వస్తే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీదే హవా అని వివిధ వార్తా సంస్థల సర్వేలు తేల్చి చెప్పాయి. ఇండియాటుడే –మై మాక్సిస్ ఎగ్జిట్ పోల్ ప్రకారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 18 నుంచి 20 ఎంపీ సీట్లు దక్కే అవకాశం ఉందని.


టైమ్స్ నౌ కూడా దాదాపు ఇదే స్థాయిలో ఎంపీ సీట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి దక్కే అవకాశం ఉందని పేర్కొంది. ఇక అసెంబ్లీ సీట్ల విషయానికి వస్తే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 130 నుంచి 133 వరకూ సీట్లు దక్కే అవకాశం ఉందని సీపీఎస్ పేర్కొంది. తెలుగుదేశం పార్టీకి 43 నుంచి  44 ఎమ్మెల్యే సీట్లు దక్కే అవకాశం ఉందని వివరించింది. జనసేన ఖాతా తెరవకపోయినా ఆశ్చర్యం లేదని, గరిష్టంగా ఆ పార్టీ మూడు ఎమ్మెల్యే సీట్లను సంపాదించుకునే అవకాశం ఉందని అంచనా వేసింది.  


ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనమే ఉంటుదని 'ఆరా' అంచానా వేసింది. వైఎస్సార్సీపీ గరిష్టంగా 24 ఎంపీ సీట్లను నెగ్గే అవకాశం ఉందని, టీడీపీ కనిష్టంగా ఒకటి నుంచి గరిష్టంగా నాలుగు ఎంపీ సీట్లను  నెగ్గే అవకాశం ఉందని 'ఆరా' అంచనా వేసింది. అయితే ఏ ఒక్క ఎగ్జిట్ పోల్ కూడా టీడీపీ గెలుస్తుందని చెప్పకపోవటం ఇక్కడ విశేషం. కొసమెరుపేమిటంటే ఒక్క లగటిపాటి  సర్వే మాత్రం టీడీపీ గెలుస్తుందని చెప్పడం ఇక్కడ అసలైన జోక్ . 

మరింత సమాచారం తెలుసుకోండి: