ఏపీలో స‌ర్వేలు అన్ని ఫ్యాన్ వైపే మొగ్గు చూపాయి. ఆదివారం సాయంత్రం వెలువ‌డిన ఎగ్జిట్‌పోల్స్‌లో ఒక‌టీ అరా మిన‌హా మిగిలిన స‌ర్వేలు జ‌గ‌న్ నేతృత్వంలోని వైసీపీయే గెలుస్తుంద‌ని చెపుతున్నాయి. ఇటు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో వైసీపీకి 100కు పైగా సీట్లు వ‌స్తాయ‌ని చెపుతోన్న స‌ర్వేలు లోక్‌స‌భ ఎన్నిక‌ల్లోనూ టీడీపీ కంటే ఎక్కువ సీట్లు వ‌స్తాయ‌ని చెపుతున్నాయి. ఇక పోలింగ్‌కు ముందే నేష‌న‌ల్ మీడియా స‌ర్వేలు అన్ని ఏపీలో ఈ సారి ఫ్యాన్ గాలి గెలుస్తుంద‌ని చెపుతూ వ‌స్తున్నాయి.


అవే స‌ర్వేలు ఇప్పుడు పోలింగ్ ముగిశాక ఎగ్జిట్‌పోల్స్‌లోనూ వైసీపీయే గెలుస్తుంద‌ని చెప్పాయి. కొన్ని సంస్థ‌లు అయితే వైఎస్సార్‌సీపీకి గరిష్టంగా 24 ఎంపీ సీట్లు వస్తాయని ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేశాయి. జగన్‌ను సీఎంగా చూడాలని 45 శాతం మంది ఆకాంక్షించారు. చంద్రబాబు కావాలని 40 శాతం మంది అన్నారు. పవన్‌ కళ్యాణ్‌ ముఖ్యమంత్రి కావాలని కోరుతున్నవారు కేవలం 13 శాతం మాత్రమే ఉన్నారు. ఇక ఏ స‌ర్వే సంస్థ ఎలాంటి ఫ‌లితాలు ఇచ్చిందో ? ఈ క్రింద చూద్దాం.


ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఫ‌లితాలు


ల‌గ‌డ‌పాటి పోల్స్ :
టీడీపీ : 90 - 110
వైసీపీ: 65 - 79
బీజేపీ: 0


పీపుల్స్ ఫ‌ల్స్‌:
టీడీపీ - 59
వైసీపీ - 112


మిష‌న్ చాణుక్య‌:
టీడీపీ: 55-61
వైసీపీ: 91-105


ఐఎఎన్ఎస్ఎస్ మీడియా ( INSS MEDIA ) :
టీడీపీ - 118
వైసీపీ - 52


ఐ న్యూస్ ( I NEWS FLASH SURVEY ) :
టీడీపీ: 55-62
వైసీపీ: 110 - 120


సీపీఎస్ స‌ర్వే ( CPS Survey ) :
టీడీపీ: 43 -44
వైసీపీ: 130 - 133


ఆరా స‌ర్వే ( AARA ): 
టీడీపీ: 50 - 55
వైసీపీ: 120 - 125


వీడీపీఏ ( VDPA Associates ) :
టీడీపీ: 54 - 60
వైసీపీ: 111 - 121


మరింత సమాచారం తెలుసుకోండి: