నలభై రోజుల ఉత్సకతకు ఎగ్జిట్‌ పోల్స్‌ రిలీఫ్‌ ఇచ్చాయి. కేంద్రంలో మళ్లీ మోడీకే అవకాశాలున్నాయని జాతీయమీడియా ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు వెల్లడి చేస్తున్నాయి.
 ఎన్డీఏ కూటమికి దాదాపు 300 సీట్లు వస్తాయని సంచలనం సృష్టించారు. వివిధ జాతీయ మీడియా సంస్దలు 250 కి అటూ ఇటూగా ఎన్డీఏకి తగ్గవని మెజారిటీ ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలను బట్టి తెలుస్తోంది.

 కాంగ్రెస్‌ పార్టీకి గతంలో కంటే స్దానాలు పెరిగినా అధికారం అందుకోలేదని ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలు చెబుతున్నాయి. యూపీఏ కూటమికి 115కి అటూ ఇటూ రావచ్చని, ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాల సరళిని బట్టి తెలుస్తోంది. 
ఒకరిద్దరు తప్ప, ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌సీపీదే హవా అని దాదాపు అన్ని వార్తా సంస్ధలు కుండబద్దలు కొట్టాయి. టైమ్స్‌ నౌ, ఇండియా టుడే అంచనా ప్రకారం 18 నుండి 20 వరకు ఎంపీ సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఇక అసెంబ్లీ స్ధానాలైతే ,130 వరకు జగన్‌కి వస్తాయని, సీపీఎస్‌ చెబితే, 102 వరకు వస్తాయని రూరల్‌ మీడియా పోస్ట్‌ పోల్‌ సర్వేలో వెల్లడించారు.130కి పైగా వస్తాయని ఇండియా టుడే ఎగ్జిట్‌ పోల్‌ సర్వేలో ప్రకటించింది. వీడీపీ అసోసియేట్స్‌ జరిపిన ఎగ్జిట్‌ పోల్స్‌ సర్వేలో 44శాతం ఓట్లతో వైఎస్సార్‌సీపీ 111 నుండి 121సీట్లు గెలుచుకోవచ్చు అని, ప్రకటించారు. కేకే సర్వే ప్రకారం 130 కి పైగా అసెంబ్లీ సీట్లు వస్తాయని తెలిసింది.
ఈ రోజు హైదరాబాద్‌, ప్రెస్‌క్లబ్‌లో జరిగిన సమావేశంలో 'ఆరా' సంస్ధ జగన్‌ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం అని ,126 సీట్లు వస్తాయని తమ సర్వేలో తేల్చి చెప్పారు. 24 వరకు ఎంపీ సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని ప్రకటించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: