ఏపీ సీఎం కుమారుడు తన తొలి ప్రత్యక్ష ఎన్నికలోనే పరాజయం పాలవుతున్నాడా.. మంగళగిరిలో లోకేశ్ ఓడిపోబోతున్నాడా.. అవునంటున్నాయి కొన్ని సర్వేలు, ఎగ్జిట్ పోల్స్.. తాజాగా మంగళగిరిలో లోకేశ్ గెలుపు కష్టమేనని  ఆరా సర్వే సంస్థ అంచనా వేసింది.


ఆరా సంస్థ నిర్వహించిన ఎగ్జిట్ పోల్ ప్రకారం వైఎస్ ఆర్ కాంగ్రెస్ కు 135 సీట్ల వరకు రావచ్చట . ఆంధ్రప్రదేశ్‌లోని 175 స్థానాల్లో 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్సార్‌ సీపీకి స్పష్టమైన మెజారిటీ వస్తోంది. ఇక లోక్‌సభ విషయానికి వస్తే.. ఏపీలోని 25 లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్‌ సీపీ 22 స్థానాలను గెలుచుకుంటుందట. 

టీడీపీ 3 స్థానాలు గెలిస్తే గొప్ప అంటున్నారు. అన్నింటి కంటే హైలెట్ ఏంటంటే.. మంగళగిరిలో లోకేశ్ గెలుపుకు ఎలాంటి భరోసా లేదట. లోకేశ్ గెలవకపోవచ్చని ఆరా సంస్థ అంచనా వేసింది. గత ఎన్నికల్లో బీజేపీ, పవన్ కల్యాణ్ కారణంగానే చంద్రబాబు సీఎం అయ్యారని ఆ సంస్థ ప్రతనిధి అభిప్రాయపడ్డారు. 

మంగళగిరి బరిలో దిగినవేళ నుంచి లోకేశ్ గెలుపుపై ధీమా తక్కువగానే ఉంది. అసలు లోకేశ్ కు అది సూటబుల్ ప్లేస్ కాదన్న వాదనలూ వున్నాయి. కానీ లోకేశ్ మొండిపట్టు వల్లే మంగళగిరిలో పోటీ చేశాడట..చూడాలి ఈ ఎగ్జిట్ పోల్ ఎంత వరకూ నిజమవుతుందో. 



మరింత సమాచారం తెలుసుకోండి: