ఏపీలో మళ్లీ తెలుగుదేశానిదే గెలుపు.. ఇదీ లగడపాటి సర్వే చెప్పింది.. శనివారమే ఆయన ఈ విషయాన్ని క్లియర్ గానే చెప్పాడు.. ఆదివారం ప్రెస్ మీట్ పెట్టి ఇంకాస్త డిటైల్డ్ గా చెప్పాడు.. ఏం చెప్పినా మళ్లీ ఏపీ సీఎం చంద్రబాబే అన్నది ఆయన మాటల సారాంశం.


కానీ ఈ మాటలు నమ్మొద్దంటున్నారు ఏపీ సీఎం చంద్రబాబు.. ఎగ్జిట్ పోల్స్ ప్రజానాడిని పసిగట్టడంలో విఫలమయ్యాయంటున్నారు. అందేంటి చంద్రబాబు గెలుస్తారని చెప్పినా నమ్మొద్దా అని ఆశ్చర్యపోకండి.. చంద్రబాబు అసలు ఎగ్జిట్ పోల్స్ నే తప్పుబడుతున్నారు. 

అందుకే ఎగ్జిట్ పోల్స్ ట్రెండ్ ప్రారంభం కాగానే ఆయన  నేను ముందే చెప్పానుగా ఎగ్జిట్ పోల్స్ నమ్మొద్దని..అంటూ ఓ ట్వీట్ రాసిపారేశారు. అంతా బాగానే ఉంది. మరి టీడీపీ గెలుస్తుందని కూడా రాజగోపాల్ సర్వేతో పాటు మరికొన్ని చెప్పాయి. అంటే బాబు థియరీ ప్రకారం.. ఇవి కూడా తప్పేగా.

అంటే పరోక్షంగా లగడపాటి సర్వేను.. టీడీపీ గెలుస్తుందని చెప్పిన ఇతర సర్వేలూ కూడా తప్పేగా.. అంటే లగడపాటి సర్వేను కూడా చంద్రబాబు తప్పుబట్టినట్టేగా.. అంతే గా.. అంతేగా..



మరింత సమాచారం తెలుసుకోండి: