అంతా అనుకున్నట్లుగానే మంత్రి లోకేష్ ఈ ఎన్నికల్లో గెలవడం కష్టమని ఎగ్టిట్ పోల్స్ తేల్చేశాయి. మంగళగిరి ముప్పయ్యేళ్ళుగా టీడీపీకి చిక్కలేదు. అటువంటి బంగారు జింకను పట్టుకుందామని రాజకీయ తొలి వేటగాడు లోకేష్ మంగళగిరిలో సై అన్నాడు. మరి ఆయన గెలుస్తారా అంటే కాదు అంటున్నాయి సర్వేలు.


మంగళగిరిలో లోకేష్ ఓటమి పాలు అవుతారని  ఆరా సర్వే సంస్థ అంచనా వేసింది.ఆ సంస్థ చేసిన ఎక్జిట్ పోల్ ప్రకారం వైఎస్ ఆర్ కాంగ్రెస్ కు 135 సీట్ల వరకు రావచ్చు.అదే సమయంలో లోకేష్ గెలవడం సందేహాస్పదమేనని ఆ సంస్థ ప్రతినిది మస్తాన్ పేర్కొన్నారు.ఆంధ్రప్రదేశ్‌లోని 175 స్థానాల్లో 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్సార్‌ సీపీకి స్పష్టమైన మెజారిటీ వస్తోంది.


 వైఎస్సార్‌ సీపీకి 48.78 శాతం, టీడీపీకి 40.18 శాతం, జనసేనకు 7.81 శాతం, ఇతరులకు 3.26 శాతం ఓట్లు పడ్డాయి. ఆంద్రప్రదేశ్‌లోని 25 లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్‌ సీపీ 22 స్థానాలను గెలుచుకుంటుంది. టీడీపీ 3 స్థానాలు గెలవొచ్చు లేదా 1కే పరిమితం అయ్యే అవకాశం కూడా ఉందని ఆయన తెలిపారు. మరి లోకేష్ గెలవకపోతే టీడీపీ ఓడిపోతే ఆ పార్టీ భవిష్యత్తు ఏంటి అన్నది కూడా ఇపుడు పెద్ద ఎత్తున చర్చకు అవకాశం ఇస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: