ఏపీలో భారీగా పోలింగ్ జరిగింది. జనం పగలు ఎండ చూడలేదు. అర్ధరాత్రి వరకూ వేచి ఉండి మరీ  వోట్ వేశారు. మరి ఎవరికి ఆ వోటు, ప్రజలు వెల్లువెత్తారు. గతం కంటే ఎక్కువగా పోలింగ్ జరిగింది. ఎవరి కోసం ఇదంతా అంటే వైసీపీ గెలుపు కోసమని ఎగ్టిట్ పోల్ సర్వేలు పక్కా క్లారిటీగా చెప్పేశాయి.


జగన్ ముఖ్యమంత్రి కావాలని, ఆయనకు ఒక్క చాన్స్ ఇద్దామని జగన్ కోరుకున్నారు. అందుకే ఆయన కోసం జనం జనం ప్రభంజనం అయింది. చినుకు చినుకూ మహా సాగరమైంది. అంతా కలసి ఓటెత్తారు. పోలింగ్ బూతులకు పోటెత్తారు. అదే సైలెంట్ వేవ్ ఐంది. 


ఇపుడు  దాన్ని డీ కోడ్ చేసి చూపించాయి ఎగ్టిట్ పోల్ సర్వేలు. ఒకటి రెండు తప్ప అన్నీ సర్వేలు జగన్ విజయం ఖాయమని తేల్చాయి. టీడీపీ గెలుస్తుందని చెప్పిన సర్వేలు కూడా వైసీపీకి ఎక్కువ సీట్లు కట్టబెట్టడం బట్టి చూస్తే జగన్ కచ్చితంగా అధికారంలోకి వస్తాడని అర్ధమైపోతోంది. మొత్తానికి జగన్ అను నేను అన్న మాట ఏపీ జనం వినే రోజు ఎంతో దూరం లేదనిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: