ఏపీలో గెలిచేదెవరు.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ప్రశ్న ఇది. దీనికి ఎగ్జిట్ పోల్స్ సమాధానం చెబుతాయని ఆశించిన సగటు ఓటరుకు నిరాశే ఎదురైంది. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ జగన్ గెలుస్తాడని చెప్పినా.. టీడీపీ గెలుస్తుందని చెప్పినవి కూడా ఉన్నాయి. 


ఇలాంటి సమయంలో ప్రొపెసర్ కె.నాగేశ్వర్‌ ఓ ఛానల్‌లో ఏపీలో గెలిచేదెవరో తన విశ్లేషణ ద్వారా తేల్చేశారు. ఆయన తాను ఎలాంటి సర్వేలు చేయలేదని..కేవలం తార్కికమైన ఆలోచనతో విశ్లేషించి చెబుతున్నానని క్లియర్‌ గా చెప్పాక తన విశ్లేషణ వినిపించారు. 

ఆయన విశ్లేషణ ఇలా ఉంది.. ఏపీలో టీడీపీ ఎట్టి పరిస్థితుల్లో గెలిచే సీట్లు.. 50 వరకూ ఉన్నాయి. దీన్ని అంతా అంగీకరిస్తున్నారు. అలాగే వైసీపీ కచ్చితంగా గెలిచే సీట్లు 65 వరకూ ఉన్నాయి. దీన్ని లగడపాటి కూడా చెబుతున్నారు. సో.. ఇవిపోగా ఇంకా మిగిలినవి 60 సీట్లు.. 

ఈ మిగిలిన 60 సీట్లలో హోరాహోరీ పోరు సాగుతోంది. ఇక్కడ ఎవరు గెలుస్తారో చెప్పలేని పరిస్థితి ఉంది. టీడీపీ అధికారంలోకి రావాలంటే.. ఈ 60 సీట్లలో కనీసం 45 సీట్లు గెలవాల్సి ఉంటుంది. కానీ ఇది సాధ్యమా.. అంటే అసాధ్యం కాకపోయినా చాలా కష్టం అని చెప్పొచ్చు. 

కానీ ఈ 60 సీట్లలో కనీసం 45 సీట్లు గెలిచి చంద్రబాబు గెలిస్తే అది నిజంగా అద్భుతమే.. పరమాద్భుతమే అంటున్నారు నాగేశ్వర్.. అంటే నూటికి 80 శాతం విజయావకాశాలు జగన్‌కే ఉన్నాయని చెప్పకనే చెబుతున్నారు కదా. 



మరింత సమాచారం తెలుసుకోండి: