ఎగ్జిట్ పోల్స్ టీడీపీకి ప్రతికూలంగా వస్తాయని మొదటి నుంచి బాబు కు తెలుసు. అందుకే పార్టీ శ్రేణులకు ముందుగానే చెప్పారు. ఎగ్జిట్ పోల్స్ నమ్మొద్దని. అయితే ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్సీపీ, కేంద్రంలో ఎన్డీయే అధికారంలోకి రాబోతున్నాయని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్అంచనా వేశాయి. టైమ్స్ నౌ-వీఎంఆర్, ఇండియా టుడే, ఇండియా-సీఎన్ఎక్స్ ఎగ్జిట్ పోల్స్‌ వైఎస్ఆర్సీపీ ప్రభంజనం ఖాయమని అభిప్రాయపడ్డాయి. లగడపాటి ఆర్జీ ప్లాష్ సర్వే, టుడేస్ చాణక్య లాంటి సర్వేలు మాత్రం టీడీపీకి అనుకూలంగా ఫలితాలు ఉంటాయన్నాయి.


కేంద్రంలో మాత్రం తిరిగి ఎన్డీయేదే అధికారమని ఎక్కువ శాతం ఎగ్జిట్ పోల్స్‌లో తేలింది. ఈ విషయమై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుస్పందించారు. మరోసారి ఎగ్జిట్ పోల్స్ ప్రజల నాడిని పట్టలేకపోయాయని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఎగ్జిట్ పోల్స్ తప్పు అని, క్షేత్ర స్థాయి వాస్తవాలకు దూరమని చాలా సందర్భాల్లో తేలింది. ఎలాంటి అనుమానాల్లేకుండా ఏపీలో టీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది.


కేంద్రంలో బీజేపీయేతర ప్రభుత్వం ఏర్పాటు అవుతుందనే విశ్వాసాన్ని చంద్రబాబు వ్యక్తం చేశారు. 2014లోనూ మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని అంచనా వేయగా.. టీడీపీ అధికారంలోకి రావడం ఇక్కడ ప్రస్తావనార్హం. పోలింగ్ స్టేషన్లలో కనీసం 50 శాతం వీవీప్యాట్ స్లిప్‌లను చంద్రబాబు మరోసారి ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు. కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభానికి ముందే ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో 5 పోలింగ్ స్టేషన్లలో వీవీప్యాట్‌లను తప్పనిసరిగా లెక్కించాని బాబు సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: