Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, Jun 17, 2019 | Last Updated 9:00 am IST

Menu &Sections

Search

ఎగ్జిట్ పోల్స్..వి'సిత్రాలు'!

ఎగ్జిట్ పోల్స్..వి'సిత్రాలు'!
ఎగ్జిట్ పోల్స్..వి'సిత్రాలు'!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ ఓడి పోలేదోయ్ ...అన్న కవి మాటలు ప్రస్తుత రాజకీయ అభ్యర్ధులందరికీ వర్తిస్తుంది. నిన్నటి దాకా మేకపోతు గాంభీర్యాన్ని ముఖానికి పులుముకున్న నాయకులు నేటి నుండి ఏ భావాన్ని ప్రదర్శించాలో కూడా తెలియని గందరగోళ పరిస్థితి. ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి.  అవి రాకున్నా మెరుగు అనుకుంటున్న నేతలు ఎందరో.  ఉరికంబం ఎక్కిన వాడిని కూడా ఒక్కసారే ఉరి తీస్తారు.  పోటీ చేసిన పాపానికి నేతలకు కంటి మీద కునుకు ఉండట్లేదు.


ముందుగా ఫలితాల వెల్లడికి ఋతుపవనాల సమయం,  ఆపై అభిమానుల హడావిడి, ఈ లోపు ఎగ్జిట్ పోల్స్ ఓ పెద్ద గుదిబండ. రేపటి ఫలితాలు ఎలా ఉంటాయో తెలియని ఉత్కంఠ. గెలిచేవాడు ఎలాగే గెలుస్తాడు, ఓడేవాడు ఎలాగూ ఓడతాడు, కాని గెలుస్తామో, ఓడతామో వారి పరిస్థితే అగమ్యగోచరం.


ఏ ఆటలోనైనా గెలుపోటములు సర్వసాధారణం. కాని ఈ రాజకీయ రణచదరంగంలో ప్రజస్వామ్యబద్ధంగా గెలిచినా ఓడినట్టే, ఓడినా గెలిచినట్టే.. ఆర్భాటంగా ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన సదరు సంస్థల పారదర్శికత ఏ పాటిదో సదరు ఆ సంస్థలకే తెలియదు. అందుకే వారి భావం మాత్రం శూన్యం. ఎగ్జిట్ పోల్స్ లో వచ్చిన నంబర్లన్నీ నిజమైనవి కావు అన్న వర్గం ఓ వైపు, లేదు ఇదే ప్రజానాడి అని మరో ఓవైపు.  రేపు గెలిచినవాడు మాది నిజమైన గెలుపంటాడు, ఓడినవాడు మోసపోయానంటాడు.  


మధ్యలో ఓటేసిన ఓటరు మాత్రం తానెవరికి, ఎందుకు ఓటేసానో కూడా అర్ధం కాక జుట్టు పీక్కుంటాడు. అభ్యర్ధి అభిమానులు దాదాపు తమ నేత భావాలనే తాము ప్రదర్శిస్తుంటారు. ఇంతమంది మధ్య గుంభనంగా ఏ భావమూ ప్రకటించని, వీటన్నిటికీ కారణమైన సంస్థ ఒక్కటుంది, అదే Expression less ‘ELECTION COMISSION OF INDIA’.  ఏదేమైనప్పటికీ పైన చెప్పుకున్న భావాలన్నీ రేపు 23 వ తారీఘున ఏలాంటి రూపుచెందుతాయో వేచి చూడాలి.


exit-polls-2019
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
About the author

Harikrishna Inturu a 20 year professional media journalist, His writings endeavor with a satirical ting for any type of articles. His pen name is well known as VISHAYA VIMARSAKUDU