విషయమేదైనా గెలికి వాసన చూసి మరీ కంపు చేసుకోవటంలో తెలుగుదేశం పార్టీ అధినేత  ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుణ్ణి మించిన వారు లేరని ఖరాఖండీగా చెప్పొచ్చు. చిన్న చేటంత విషయాన్ని వేలెట్టి చాటంత చేయగల గుల పిపాసి చంద్రబాబు అంటారు విశ్లేషకులు 

2018 తెలంగాణ విధానసభ ఎన్నికలలో అవసరానికి మించి ఆ రాష్ట్రంలోకి చొచ్చ్గుకు పోయి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో గిల్లి కజ్జాలు పెట్టుకోని – ఆ గర్భ శత్రువైన కాంగ్రెసుతో మైత్రి నెరపి తెలంగాణా జన సమితి సీపీఇ లను కలుపుకొని ప్రజా ఫ్రంట్ పేరుతో చేసిన ప్రయోగం వికటించి తెలంగాణాలో తెలుగుదేశానికే కాకుండా ఫ్రంట్ లోని వారందరికి రాజకీయంగా తద్దెనం పెట్టెసి ఇక తెలంగాణా ముఖం చూసే వీలులేకుండా చేసుకున్నారు.
Image result for kcr return gift to chandrababu naidu
వేలుకుపెట్టేది కాలుకు పెడితే కాయం మొత్తం కోసేసినట్టు రాదగ్గ,  పది - పన్నెండు సీట్లు టీడీపీకి రాకపోవటం, గెలవాల్సిన కాంగ్రెస్ కు సైతం ఓటర్లు హళ్లికి హళ్ళీ సున్నాకి సున్నా చూటేయటంతో చంద్రబాబు తో స్నేహం అంటే మహాపాతకం చుట్టుకుంటుందన్నట్లు  అన్నీ పార్టీలు పతనం అయ్యాయి. ఛావుదెబ్బ తినాల్సిన కేసీఆర్ ఘన విజయం సాధించారు. చంద్రబాబు తెలంగాణా లో వెలుపెట్తక పోతే కెసీఆర్ ఇప్పుడు నేషణల్ ఫ్రొంట్ అంటూ సచివాలయానికి రాకుండా రాష్ట్ర పాలనని వదిలేసి నిశ్చింతగా కూర్చునేవారు కాదు. 

తెలంగాణ ఎన్నికల ఫలితాలు విడుదలైన సమయంలో, కేసీఆర్ ప్రెస్-మీట్ పెట్టి,  తెలంగాణ విషయంలో జోక్యం చేసుకున్న దానికి తన బంగారు తెలంగాణా పుట్టలో వేలు పెట్టినందుకు టీడీపీ అధినేత చంద్రబాబుకు రిటర్న్-గిఫ్ట్ ఖాయంగా యిస్తానని కాస్త కఠువుగానే  చెప్పారు.  ఆ విధంగా కేసీఆర్ నోటి నుంచి ఊడిపడ్ద “రిటర్న్ గిఫ్ట్” అనే మాట ప్రజల్లో ఎంతగా చొచ్చుకుపోయిందో చెప్పాలంటే దానిపై ఒక హాస్య సినిమా తీయొచ్చు. 

అదీ చంద్రబాబు గెలికి వాసన చూసే తీరు. ఆయన మాటలకు తగ్గట్లే.. ఏపీలో జరిగిన శాసనసభ  మరియు సాధారణ ఎన్నికల్లోఎన్నికల్లో జోక్యం చేసుకునే ప్రయత్నం కూడా చేసి, తద్వారా వ్యూహాత్మకంగా  దాని కారణంగా టిడిపికి మేలు తన మిత్రపక్షం వైసిపికి నష్టం కలుగుతుందన్న విషయాన్ని గుర్తించి, జాగ్రత్తగా  నిశ్శబ్ధమై వ్యూహం మార్చారు కేసీఆర్. 
Image result for kcr return gift to chandrababu naidu
ఎన్నికల్లో అత్యంత కీలక ఘట్తమైన పోలింగ్ కు కొద్ది రోజుల ముందు ముందు పోలవరం మీద, ఏపీ ప్రత్యేక హోదా విషయంలో తమ మద్దతు వైఎస్ జగన్మోహన రెడ్డికి ఉంటుందని చేసిన వ్యాఖ్యలు వైసిపీకి ప్రయోజనకరంగా మారి, జనంలోకి సానుకూల సంకేతాలుగా వెళ్ళిపోయాయని చెప్పాలి. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సోదరభావం ఇచ్చిపుచ్చు న్కునే ధోరణి ఉండాలంటే జగన్మోహనరెడ్డి  అధికారం లోకి రావాలన్న భావన ఏపీ ప్రజల్లోకి ఇంజెక్ట్ అయిన పరిస్థితి. 

అన్నింటికీ తోడు.. చంద్రబాబు ఐదేళ్ల పాలనలోఆయన చేసిన వందలాది వాగ్ధానలు నెరవేరకపోగా, చెప్పిన అబద్ధాలు, చంద్రబాబు ఇంద్రుడు, చంద్రుడు, చానక్యుడు, కేంద్రంలో చక్రం త్రిప్పుతాడు వంటి అవారా తరహా కుల మీడియాలో  చేసిన ప్రచారం దారుణమైన పరిస్థితులకు ఆజ్యం పోసింది. రాష్ట్రం ఆర్ధికంగా దివాలా తీయబోతు న్న పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో “బైబై బాబు!” అన్న మాటను ఏపీ ప్రజలు నిర్ణయించుకొని చెప్పేసినట్లుగా చెప్పాలి. ఆనుభవఙ్జుడని అవకాశమిస్తే ఏపికి చిప్ప చేతికిచ్చిన బాబు ఓటమిలో - ఒక సారి అవకాశమిమ్మని కోరిన జగన్మొహనరెడ్డిపై ప్రజల్లో పెల్లుభికిన విశ్వసనీయతను తక్కువ వేయలేం. అదే సమయంలో కేసీఆర్ జనం లో జగన్ పట్ల వ్యాపింపజేసిన సానుకూలతనుమర్చిపోలేం. 

ఇందు మూలంగా తెలిసిందేమంటే కేసీఆర్ ఇస్తానన్న రిటర్న్ గిఫ్ట్ చంద్రబాబు కు ఎగ్జిట్ పోల్స్ ద్వారా సంకేతాలు అందగా మే 23 రోజున అధికారం నుండి బాబుగారి పర్మినెంట్ ఎక్జిట్ తో రిటర్న్ గిఫ్త్ చేలోకి వచ్చినట్లేనన్న మాట వినిపిస్తోంది.  చంద్రబాబుకు కేసీఆర్ ఇస్తానన్న రిటర్న్ గిఫ్ట్ అనే అధికార మార్పిడి జరిగి అది జగన్ చేతికి అందటమేననేది మాత్రమే నన్నమాటను కొందరు రాజకీయ నేతలు అంటున్నారు.  

Image result for chandrababu will be defeated on 23 rd may

మరింత సమాచారం తెలుసుకోండి: