ఏపీ సీఎం చంద్ర‌బాబు పొలిటిక‌ల్ కెరీర్ ఈ ఎన్నిక‌ల ఫ‌లితాల‌తో ఖ‌తం కాబోతుందా ? అంటే ఎన్నిక‌ల ఫ‌లితాల‌కు మూడు రోజుల ముందే వెలువ‌డిన ఎగ్జిట్‌పోల్స్ అవున‌నే చెప్పేశాయి. ఏపీలో చంద్ర‌బాబు సీఎం పీఠం దిగ‌డం... జ‌గ‌న్ సీఎం అవ్వ‌డంపై ఓ క్లారిటీ వ‌చ్చేసింది. ఏపీలో ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై పోలింగ్ ముగిసిన‌ప్ప‌టి నుంచే సందేహాల‌తో ఉన్న చంద్ర‌బాబు పోలింగ్ ముగిశాక ఎట్టి ప‌రిస్థితుల్లోనూ మోడీ గెల‌వ‌కూడ‌ద‌ని.. మోడీ మ‌ళ్లీ పీఎం అయితే ఏపీలో టీడీపీని బ‌త‌క‌నీయ‌డ‌ని... త‌న‌కు జైలు త‌ప్ప‌ద‌ని గ్ర‌హించిన బాబు మోడీకి యాంటీగా దేశంలో ప‌లు ప్రాంతీయ పార్టీల‌ను ఏకం చేయ‌డానికి నానా పాట్లు ప‌డ్డారు.


అయితే ఏపీలో చంద్ర‌బాబు మ‌హా అయితే ఐదారు ఎంపీ సీట్ల‌కు మాత్ర‌మే ప‌రిమితం కానున్నారు. ఈ ఐదారు ఎంపీ సీట్ల‌తో మ‌మ‌తా, మాయావ‌తి, కాంగ్రెస్ పార్టీ లాంటి వాళ్లు బాబును ద‌గ్గ‌ర‌కు రానిస్తార‌ని అనుకోలేం. ఇటు ఏపీలోనూ.. అటు కేంద్రంలోనూ బాబు ప‌ని పాయే అన్న‌ట్టుగా ఉంది. బాబుకు వ‌చ్చే ఐదారు సీట్ల‌తో ఆయ‌న కేంద్రంలో చ‌క్రాలు, చైన్లు తిప్పే ప‌రిస్థితి లేదు. అస‌లు ఆయ‌న్ను బీజేపీయేత‌ర ఫ్రంట్‌లోకి తీసుకుంటారా ? అన్న‌దీ సందేహమే. ఇక ఎగ్జిట్‌పోల్స్ కేంద్రంలో మ‌రోసారి బీజేపీ, ఎన్డీయేకు స్ప‌ష్ట‌మైన మెజార్టీ వ‌స్తుంద‌ని.. వ‌రుస‌గా రెండోసారి కూడా మోడీ పీఎం పీఠం ఎక్కుతున్న‌ట్టు తేల్చేశాయి. దీంతో మోడీ అక్క‌డ గెలిచాక ఇక్క‌డ బాబుకు చుక్క‌లు చూపిస్తార‌న‌డంలో సందేహం లేదు.


కేంద్రంలో ఫ‌లితాల‌పై వివిధ స‌ర్వేల అంచ‌నాలు చూస్తే వీడీపీఏ:బిజెపి + 333: కాంగ్రెస్‌+115: ఇతరులు:94 - టైమ్స్‌ నౌ-సీఎన్‌ఎక్స్‌: బిజెపి+:306 కాంగ్రెస్‌+:132 ఇతరులు: 104 - రిపబ్లిక్‌ టీవీ‌:  బిజెపి +:287 కాంగ్రెస్‌+:128 ఇతరులు:127 - రిపబ్లిక్‌ టీవీ -జన్‌ కీ బాత్‌: బిజెపి+295-315: కాంగ్రెస్‌+122-125: ఇతరులు:102-125 - రిపబ్లిక్‌ టీవీ - సీ- ఓటర్: బిజెపి +287: కాంగ్రెస్‌+128: ఇతరులు:127గా ఉన్నాయి. ఇక ఓవ‌రాల్‌గా ఇటు ఏపీలో మ‌ళ్లీ అధికారం ద‌క్కే ఛాన్స్ లేదు. కేంద్రంలో మోడీ పీఎం అయితే బాబును ద‌గ్గ‌ర‌కు కూడా రానీయ్య‌డు స‌రిక‌దా... ఓ ఆటాడేసుకుంటాడు. ఏపీలో టీడీపీ ప్లేస్‌లోకి బీజేపీని ఎంట్రీ చేయించేందుకు మోడీ - షా ద్వయం త‌మ ప్లాన్లు తాము వేసుకుని కూర్చొంటుంది. ఇక ఇప్పుడు బాబు ఐదేళ్ల‌లో చేసిన ప‌నుల్లో తీవ్ర‌మైన అవినీతి జ‌ర‌గ‌డంతో... అది రుజువు అయితే బాబు అరెస్టు అయ్యే ఛాన్స్ కూడా ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: