తెలుగుదేశంపార్టీని  ఊహించని రీతిలో  ఓ సామాజికవర్గం దెబ్బ తీసిందా ? ఎగ్జిట్ పోల్ సర్వే వివరాలను చూస్తుంటే అందరిలోను అదే అనుమానం బలపడుతోంది. టిడిపి పెట్టినప్పటి నుండి  మద్దతుగా నిలబడిన బలమైన సామాజికవర్గం మొన్నటి ఎన్నికల్లో గట్టి దెబ్బ కొట్టిందని సమాచారం. ఇంతకీ ఆ బలమైన సామాజికవర్గం ఎవరా అని ఆలోచిస్తున్నారా ?  అవును అదే బిసి సామాజికవర్గమే.

 

పోయిన ఎన్నికల్లో చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి అనేక కారణాల వల్ల బిసిలను దూరం చేసుకున్నారు. ఉద్దేశ్యపూర్వకంగానే బిసి సామాజికవర్గాలతో  చంద్రబాబు శతృత్వం పెంచుకున్నారు. బిసి అనేది విస్తృతార్ధం వచ్చే పదం. కానీ అందులో దాదాపు 140 ఉపకులాలున్నాయి.

 

బిసిల్లో బలమైన ఉపకులాలు యాదవులు, (గౌడ)శెట్టి బలిజలు, చేనేత, మత్స్యకారులు. శెట్టిబలిజలు ఎక్కువగా ఉభయగోదావరి జిల్లాల్లో ఉంటే గౌడ్లు ఎక్కువగా కృష్ణ, గుంటూరు జిల్లాలో బాగా డామినేషన్ . ఉత్తరాంధ్రలో సెగిరి, శ్రీసయన, యాత పేర్లతో ఉంటారు గౌడ్లు. సరే ఉపకులమేదైనా మొన్నటి ఎన్నికల్లో వాళ్ళల్లో అత్యధికులు వైసిపి వైపు మొగ్గు చూపినట్లు అంచనా.  యాదవుల్లో 49.49 శాతం, శెట్టిబలిజల్లో 47.48 శాతం, పద్మశాలీల్లో 45. 53 శాతం, రజకల్లో 48 శాతం, 52.78 శాతం బోయలు, బెస్తల్లో 43 శాతం ఓట్లు వైసిపికి పడ్డాయనేది ఓ అంచనా.

 

శెట్టి బలిజలు లేదా గౌడ్లు ఉభయగోదావరి జిల్లాల్లో బాగా డామినేటింగ్ గా ఉంటారు. అలాగే యాదవులు రాయలసీమ, రాజధాని జిల్లాలైన కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఉన్నారు. ఇక బెస్తలు లేదా జాలర్లు లేదా మత్స్యకారులు ప్రధానంగా తీరప్రాంతాలైన శ్రీకాకుళం, విశాఖపట్నం, గుంటూరు, కృష్ణా, నెల్లూరు, ప్రకాశం, ఉభయగోదావరి జిల్లాల్లో ఎక్కువగా ఉన్నారు. బోయలు, కురబలు ఎక్కువగా కర్నూలు, అనంతపురం జిల్లాల్లో బాగా ఉన్నారు.

 

ఎగ్జిట్ పోల్ సర్వేల ప్రకారం బిసిలు మొదటిసారిగా టిడిపికి వ్యతిరేకంగా ఓట్లేసినట్లు తెలుస్తోంది. వివిధ సందర్భాల్లో బిసిలతో చంద్రబాబు వ్యవహరించిన తీరు బాగా వివాదాస్పదమైంది. తమ సమస్యలు చెప్పుకోవటానికి వచ్చిన ఉపకులాల సంఘాల నేతలతో చంద్రబాబు ఎలా వ్యవహరించింది అందరూ చూసిందే.

 

అదే సమయంలో బిసిలను దగ్గర చేసుకోవటానికి జగన్మోహన్ రెడ్డి బాగా కష్టపడ్డారు. అనంతపురం జిల్లాలోని రెండు ఎంపి సీట్లను బిసిలకు కేటాయించారు. అలాగే కర్నూలు ఎంపి సీటును కూడా బిసిలకే ఇచ్చారు. మొన్న వచ్చిన ఏకైక ఎంఎల్సీ స్ధానాన్ని బిసి నేత జంగా కృష్ణమూర్తికే కేటాయించారు. అలాగే ఏలూరు లో చేసిన గర్జనతో మెజారిటీ బిసిలను జగన్ వైసిపి వైపు మళ్ళించగలిగినట్లు కనిపిస్తోంది. కాబోయే సిఎం జగనే అనేంతటి ఊపు ఈరోజు కనిపిస్తోందంటే అందుకు బిసిలిచ్చిన మద్దతే అని చెప్పుకోవాలి.

 


మరింత సమాచారం తెలుసుకోండి: