ఏపీలో హోరా హోరీగా జ‌రిగిన ఎన్నిక‌లు అనేక ట్విస్టుల‌పై ట్విస్టులు ఇస్తున్నాయి. న‌రాలు తెగే ఉత్కంఠ‌కు మ‌రో మూ డు రోజుల వ‌ర‌కు తెర‌ప‌డేలా క‌నిపించ‌డం లేదు. దీంతో ఎగ్జిట్ పోల్ స‌ర్వేలైనా.. ఒకింత ఉప‌శ‌మ‌నం క‌లిగిస్తాయ‌ని రాజ కీయ నాయ‌కులు, ప్ర‌జ‌లు కూడా భావించారు. అయితే, తాజాగా వెల్ల‌డైన స‌ర్వే ఫ‌లితాలు.. మ‌రింత‌గా టెన్ష‌న్‌ను పెంచేశా యి. ముఖ్యంగా త‌మ ప‌సుపు, కుంకుమ త‌మ‌ను ర‌క్షిస్తుంద‌ని, త‌మ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌స్తుంద‌ని దండోరా వేస్తు న్న చంద్ర‌బాబు టీంకు ఇప్పుడు ఏం చేయాలో అర్ధం కానిప‌రిస్థితి ఏర్ప‌డింది. 


కేవ‌లం ఆర్జీ ఫ్లాష్ స‌హా ఒక‌టి రెండు సంస్థ లు మాత్ర‌మే చంద్ర‌బాబుకు పాస్ మార్కులు వేయ‌గా.. మిగిలిన సంస్థ‌ళు ఎక్క‌డా కూడా చంద్ర‌బాబుకు అధికారం ద‌క్కుతుంద‌ని చెప్పలేదు. మ‌రీ ముఖ్యంగా గ‌త డిసెంబరులో తెలంగాణాలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో కేసీఆర్ అధికారంలోకి వ‌స్తాడ‌ని చెప్పి, అంద‌రి దృష్టి నీ ఆక‌ర్షించిన సంస్థ సీపీఎస్ కూడా ఏపీలో జ‌గ‌న్‌దేన‌ని స్ప‌ష్టం చేసింది. దీంతో రాష్ట్రంలో బాబు ప‌రిస్థితి, టీడీపీ ప‌రిస్థితి పై పెద్ద ఎత్తున చ‌ర్చ సాగుతోంది. అదేస‌మ‌యంలో.. ఏపీ సీఎం చంద్ర‌బాబుకు రిట‌ర్న్ గిఫ్ట్ ఇస్తాన‌న్న తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్య‌లు నిజ‌మ‌వుతున్నాయా? అనే వ్యాఖ్య‌లు కూడా వినిపిస్తున్నాయి. 


గ‌త ఏడాది డిసెంబ‌రులో జ‌రిగిన తెలంగాణ ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు వేలు పెట్టారు. త‌నుకానీ, త‌న పార్టీ కానీ అధికారంలోకి వ‌చ్చేది లేద‌ని తెలిసి కూడా కేసీఆర్‌ను ఓడించ‌డ‌మే ధ్యేయంగా ఆయ‌న ముందుకు వెళ్లారు. ఈ విష‌యాన్ని సీరియ‌స్‌గా తీసుకున్న కేసీఆర్‌.. త‌మ ఇంటికొచ్చి.. త‌మ కంట్లో వేలు పెట్టాల‌ని చూసిన చంద్ర‌బాబుకు భారీ ఎత్తున రిట‌ర్న్ గిఫ్ట్ ఇస్తామ‌ని కేసీఆర్ అప్ప‌ట్లోనే ప్ర‌క‌టించారు. ఇదే ఇప్పుడు నిజ‌మ‌వుతోందా? అనే సందేహాలు తెర‌మీదికి వ‌చ్చాయి. తెలంగాణ ఎన్నికల ఫలితాలు విడుదలైన వేళ.. కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి.. తెలంగాణ విషయంలో జోక్యం చేసుకున్న దానికి టీడీపీ అధినేత చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఖాయమన్న మాటను చెప్పారు. 


కేసీఆర్ నోటి నుంచి వచ్చిన రిటర్న్ గిఫ్ట్ మాట ఎంతలా పాపులర్ అయ్యిందో తెలిసిందే. ఆయన మాటలకు తగ్గట్లే.. ఏపీలో జరిగిన ఎన్నికల్లో జోక్యం చేసుకునే ప్రయత్నం చేసినా.. దాని కారణంగా నష్టం కలుగుతుందన్న విషయాన్ని గుర్తించి.. జాగ్రత్త పడ్డారు కేసీఆర్. ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ కు ముందు పోలవరం మీద.. ఏపీ ప్రత్యేక హోదా విషయంపై ఆయన చేసిన వ్యాఖ్యలు జగన్ కు లాభంగా మారాయని చెప్పాలి. మొత్తంగా తాజాగా వెల్ల‌డైన స‌ర్వే ఫ‌లితాలు చంద్ర‌బాబుకు ఇంద్ర‌ప‌ద‌విని దూరం చేసేలా ఉన్నాయ‌ని, ఇది రిట‌ర్న్ గిఫ్ట్‌లో భాగ‌మేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: