ఎగ్జిట్ పోల్ సర్వే పేరుతో లగడపాటి రాజగోపాల్ విడుదల చేసిన సర్వే బోగస్ అని తేలిపోయింది. అదికూడా ఓ టివి ఛానల్ చర్చా ఘోష్టిలో ఆయన మాటల్లోనే తేలిపోయింది. ఎగ్జిట్ పోల్  టిడిపిదే అధికారం అని లగడపాటి ఆదివారం సాయంత్రం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే రాత్రయ్యేసరికి  లగడపాటి లెక్కల్లోని డొల్లతనం బయటపడిపోయింది.

 

ఇంతకీ విషయం ఏమిటంటే ఉభయగోదావరి జిల్లాలు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లోని 38 నియోజకవర్గాల్లో సర్వే జరిపించి ఆ ఫలితాన్ని మొత్తం 175 నియోజకవర్గాలకు లగడపాటి ఆపాదించేశారనే ప్రచారం ఒక్కసారిగా పెరిగిపోయింది. అసలే లగడపాటి సర్వేపై అందరిలోను అనుమానాలున్నాయి. చంద్రబాబునాయుడు దగ్గర బాగా లబ్దిపొందిన వ్యక్తి తన సర్వేలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి చెబుతాడని ఎవరూ అనుకోలేదు.

 

 అదే సమయంలో ఓ ఛానల్ తో మాట్లాడుతూ తాము 110 నియోజకవర్గాల్లోనే సర్వే చేయించినట్లు అంగీకరించారు. 38 నియోజకవర్గాల్లోనే సర్వే చేయించినట్లు జరుగుతున్న ప్రచారం గురించి ఏమీ మాట్లాడలేదు. పైగా  తాము చేయించిన 110 నియోజకవర్గాల్లో కూడా తమకు అనుకూలంగా ఉన్న నియోజకవర్గాల్లోనే సర్వే చేయించినట్లుగా చెప్పటం విచిత్రంగా ఉంది.

 

మొత్తం 175 నియోజకవర్గాల్లో చేయించాల్సిన సర్వేని 110 నియోజకవర్గాల్లోనే  చేయించటమేంటి ? ఆ ఫలితాలను మొత్తం 175 నియోజకవర్గాలకు ఆపాదించటమేంటో అర్ధం కావటం లేదు. సర్వే చేయకుండా వదిలేసిన 65 నియోజకవర్గాలు ఏ జిల్లాల్లో ఉన్నాయో లగడపాటి చెప్పలేదు. ఒకవేళ అవి రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో ఉండుంటే అదంతా వైసిపికి స్వీప్ అవుతాయని అంచనాలున్నాయి.

 

లగడపాటి సర్వే ప్రకారమే వైసిపికి 65-79 సీట్లిచ్చాడు. టిడిపి గెలుచుకునే స్ధనాలు 90- 110 ఇచ్చాడు. ఇందులో లగడపాటి చేయని 65 స్ధానాలు కూడా ఉన్నాయి. ఒకవేళ లగడపాటి సర్వే చేయకుండా వదిలేసిన 65 స్ధానాల్లో ఓ 50 నియోజకవర్గాల్లో టిడిపి ఓడిపోతే అపుడు  వైసిపి గెలుచుకునే స్ధానాలు 79+50= 129 స్ధానాలవుతాయి. అంటే బంపర్ మెజారిటీతో వైసిపినే అధికారంలోకి వచ్చే అవకాశాలున్నాయి. అపుడు రెండోసారి కూడా లగడపాటి ఫలితాలు తప్పవుతాయి. దీన్ని బట్టే లగడపాటి ఎగ్జిట్ పోల్ బోగస్ అని తేలిపోతోంది.

 

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: