ఏజెంట్లకు బ్యాలెట్ పత్రాలు ముట్టుకునే అర్హత లేదు . ఫలితం వెల్లడించాక రీకౌంటింగ్‌కు చాన్స్ ఉండదు. ఒకే అభ్యర్థికి ఎన్నిచోట్ల గుర్తులుపడినా ఓటుచెల్లుబాటు ఓట్ల లెక్కింపుపై మార్గదర్శకాలు విడుదలచేసిన ఎస్‌ఈసీ పరిషత్ ఓట్ల లెక్కింపులో రిటర్నింగ్ అధికారులదే తుదినిర్ణయమని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిం ది. ఈ నెల 27న జరిగే ఓట్ల లెక్కింపులో బ్యాలెట్ పత్రాలను తిరస్కరించడం నుంచి ఫలితాలను వెల్లడించడం వరకు ఆర్వోలదే పూర్తి అధికారమని ఎస్‌ఈసీ విడుదలచేసిన మార్గదర్శకాల్లో స్పష్టంచేసింది.


ఓట్లలెక్కింపు అధికారులు, సిబ్బందికి ఈ నెల 18 నుంచి ఇస్తున్న శిక్షణ కార్యక్రమాలు సోమవారం పూర్తవుతాయని తెలిపింది. సిబ్బంది ఈనెల 26 నుంచే విధుల్లో ఉంటారని పేర్కొన్నది. ఎస్‌ఈసీ మార్గదర్శకాలు -తిరస్కరించే బ్యాలెట్‌పత్రాలపై అంతిమనిర్ణయం రిటర్నింగ్ అధికారిదే. అయితే ముందుగా దానిని సమగ్రంగా పరిశీలించి ఎందుకు తిరస్కరిస్తున్నారో వెనుకభాగంలో కారణాలను పేర్కొనాలి.


బ్యాలెట్ పేపర్‌ను అభ్యర్థి కానీ, ఏజెంట్ కానీ ముట్టుకోవడానికి అవకాశం లేదు. వారికి కేటాయించిన స్థలం నుంచి మాత్రమే పరిశీలించాలి. -ఒకఅభ్యర్థికి వేసిన గుర్తు బ్యాలెట్ పత్రం మడత సందర్భంగా ప్రతిబింబంగా ఉంటే అది చెల్లుబాటవుతుంది. అయితే, దానిని నిర్ణయించాల్సింది రిటర్నింగ్ అధికారి మాత్రమే. ఒక అభ్యర్థికి ఓటు గుర్తువేసిన తర్వాత ఇంకో గుర్తుపై సిరా లేదా, చేతి మరక పడితే .. గుర్తువేసిన అభ్యర్థికి ఓటునమోదు చేయాలి.


ఒకే అభ్యర్థికి నాలుగైదుచోట్ల ఓటుగుర్తు ఉంటే దానిని కూడా చెల్లుబాటుచేయాలి. ఒక అభ్యర్థికి గుర్తువేసి, మరో అభ్యర్థి గుర్తుపై సంతకం చేసినా.. బ్యాలెట్ పేపర్ షెడెడ్ ఏరియాలో అంటే బార్డర్ లైన్ మధ్యలో ఓటు గుర్తు ఉంటే వాటిని తిరస్కరించాలి. లెక్కింపు ప్రక్రియ పూర్తయి రిటర్నింగ్ అధికారి ఫలితం పత్రాల్లో సంతకం చేశాక రీ కౌంటింగ్ అప్పీల్‌ను స్వీకరించరు. ఫలితాన్ని ప్రకటించాక ఒకటి లేదా రెండునిమిషాలు ఆగి ఆర్వో ఫలితాల పత్రాలపై సంతకాలు చేయాలి. ఈలోగా రీకౌంటింగ్‌కు సరైన ధ్రువీకరణలతో డిమాండ్ చేస్తే స్వీకరిస్తారు. ఎక్కువ సమయం తీసుకున్నా, అనవసరపు ఆరోపణలు చేసినా రీకౌంటింగ్‌పై రిటర్నింగ్ అధికారే నిర్ణయం తీసుకుంటారు. 


పలితాల పత్రంపై సంతకం చేసిన వెంటనే ఫలితాలను టీ పోల్ సాఫ్ట్‌వేర్‌లో అప్‌లోడ్ చేయాలి. -అభ్యర్థులు తరఫున ఏజెంట్లు, ఇతరులు కౌంటింగ్ కేంద్రాల్లోకి వచ్చినా, సిబ్బందిని బెదిరించేందుకు యత్నించినా ఓట్ల లెక్కింపు ను నిలిపివేసే అధికారం ఆర్వోకు కల్పించారు


మరింత సమాచారం తెలుసుకోండి: