దేశ రాజ‌కీయాలు చూస్తుంటే చాలా బాధ‌గా ఉంద‌ని అన్నారు ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడు. నేటి చ‌ట్ట‌స‌భ‌లు న‌డుస్తున్న తీరు బాధాక‌ర‌మ‌ని అన్నారు. రాజ‌కీయ నేత‌లు త‌మ నోరును అదుపులో పెట్టుకోలేక‌పోతున్నారు. దిగ‌జారిపోయి మాట్లాడుతున్నారు. వారి మాట్లాడే భాష‌ను చూస్తుంటూ ఎంత దిగ‌జారిపోయారో అర్థ‌మ‌వుతోంది అని వెంక‌య్యనాయుడు అన్నారు. రాజ‌కీయాలు చాలా దిగ‌జారిపోయాయ‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. గౌర‌వ డాక్ట‌రేట్ అందుకున్న సంద‌ర్భంగా గుంటూరు క్ల‌బ్‌లో ఏర్పాటు చేసిన ఆత్మీయ స‌మావేశంలో పాల్గొన్నారు. 


42 ఏళ్ల త‌ర్వాత దేశంలో తొలిసారిగా తాను లేకుండా ఎన్నిక‌లు జ‌రిగాయ‌ని ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడు అన్నారు. నేటి చట్టసభలు నడుస్తున్న తీరు బాధాకరమన్న ఆయ‌న‌.. రాజకీయాలు చాలా దిగజారిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి రాజకీయాలపై ప్రజలు, పత్రికలు సమీక్షలు చేయాలని కోరారు.


సార్వ‌త్రిక ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత అంద‌రు ఎగ్జిట్ పోల్స్‌ను చూస్తార‌ని.. కానీ అంద‌రు చూడాల్సింది ఎగ్జాట్ పోల్స్ అని స్ప‌ష్టం చేశారు వెంక‌య్య‌నాయుడు. అప్పుడే ప్ర‌జ‌లు తీర్పు ఎవ‌రికి వ‌రిస్తుందోన‌ని ఆయ‌న వెల్ల‌డించారు. త‌న రాజ‌కీయ జీవితంలో ప్ర‌జ‌లు ఇచ్చిన సొమ్ముతోనే పోటీ చేశాన‌ని చెప్పారు. 


అయితే అందులో కొంత మేర డ‌బ్బు కూడా మిగిలేద‌ని.. వాటిని పార్టీ కార్యాల‌య ఖర్చుల‌కు వినియోగించే వాళ్ల‌మ‌ని తెలిపారు.  కానీ ప్ర‌స్తుతం ఎన్నిక‌ల్లో రూ.కోట్లకు కోట్లు ఖ‌ర్చు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ నేప‌థ్యంలో అస‌లు రాజ‌కీయాల్లో మ‌న‌కు ఎవ‌రు శ‌త్రువులు ఉండ‌ర‌ని చెప్పిన ఆయ‌న.. ఒక‌రిపై ఒక‌రు వ్య‌క్తిగ‌త దూష‌ణలు, ఇష్ట‌మొచ్చిన‌ట్లు తిట్టుకోవ‌డం స‌రికాద‌న్నారు. 

 

ఫ‌స్ట్ నుంచి కమ్యూనిజం అంటే వ్య‌తిరేక‌మ‌ని చెప్పిన వెంక‌య్య‌నాయుడు.. వామ‌ప‌క్షాల నాయ‌కులంటే త‌న‌కు గౌర‌వం ఉంద‌న్నారు. ఇక‌ ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్ఠంగా ఉండాలంటే ఎన్నికలు, ఎంపికలు, అభ్యర్థులు, రాజకీయపార్టీలన్నీ తమ బాధ్యతలను సమర్థంతంగా నిర్వ‌హించాల‌ని చెప్పారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: