ఎగ్జిట్ పోల్ ఫలితాలు చంద్రబాబునాయుడుకు అన్నీ విధాలుగాను షాక్ ఇస్తున్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఓడిపోయినా కేంద్రంలో ఏదో విధంగా చక్రం తిప్పేయాలన్న ఉద్దేశ్యంతో తెగ ఆరాటపడుతున్న చంద్రబాబుకు మాయావతి, స్టాలిన్ పెద్ద షాకే ఇచ్చారు.

 

ఎగ్జిట్ పోల్ సర్వేల్లో ఎన్డీఏనే మళ్ళీ అధికారంలోకి వస్తుందని స్పష్టంగా తేలిపోయింది. దాంతో బిజెపి, ఎన్డీఏ యేతర పక్షాల సమావేశాం దాదాపు రద్దైనట్లే అనుకోవాలి. 23వ తేదీన ఢిల్లీలో మోడి, ఎన్డీఏ యేతర పార్టీలు, నేతలతో సమావేశం జరపాలని సోనియాగాంధి నిర్ణయించారు. ఆ మేరకు చాలామందికి వర్తమానాలు కూడా పంపారు.

 

ఆ విషయంపైనే మాయావతి, స్టాలిన్ మాట్లాడుతూ ఇక 23వ తేదీ సమావేశం జరపాల్సిన అవసరం  లేదని తేల్చేశారు. ఎగ్జిట్ పోల్ సర్వేల్లో ఎన్డీఏకి క్లియర్ కట్ మెజారిటీ వస్తుందని తెలిసిపోయిన తర్వాత కూడా 23 సమావేశం ఎందుకు ? అంటూ వీళ్ళద్దరూ ప్రశ్నించారు. ఎలాగైనా సమావేశం ఏర్పాటు చేయించి అక్కడ ఏదో షో చేద్దామని అనుకున్న చంద్రబాబుకు ఎగ్జిట్ పోల్ ఒక విధంగా షాక్ ఇచ్చినట్లే అయ్యింది.

 

మోడి, ఎన్డీఏ వ్యతిరేక పార్టీలు, నేతల్లో ఎగ్జిట్ పోల్ తర్వాత జావ కారిపోయారు. మీడియా సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు మొహంలో కూడా ఎక్కడా నవ్వన్నదే కనబడలేదు. కాకపోతే మేకపోతు గాంభీర్యమన్నట్లుగా ఎగ్జిట్ పోల్ సర్వేలను నమ్మవద్దు, టిడిపినే అధికారంలోకి రాబోతోందంటూ ఏవోవే అర్ధం లేకుండా మాట్లాడారు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: