విడుద‌లైన ఎగ్జిట్ పోల్స్ పై స్పందించారు కాంగ్రెస్ సీనియ‌ర్ నేత శ‌శిథ‌రూర్‌. అస‌లు ఫ‌లితాలు, ప్ర‌జ‌ల తీర్పు ఎవ‌రి సైడ్ ఉందో తెలువాలంటే మే 23 వ‌ర‌కు ఆగాల్సిందేన‌ని అన్నారు. కాగా.. దేశ వ్యాప్తంగా ఏడు ద‌శ‌ల్లో సార్వ‌త్రిక ఎన్నిక‌లు ముగిశాయి. మ‌రోవైపు ఎగ్జిట్ ఫ‌లితాలు కూడా వెల్ల‌డ‌య్యాయి. ఈ నేప‌థ్యంలో ఎగ్జిట్ పోల్స్ లో మెజార్టీ స‌ర్వే సంస్థ‌ల‌న్నీ ప్ర‌జ‌లు బీజేపీకే మొగ్గు చూపిన‌ట్లు తెలిపాయి.

అయితే ఇప్ప‌టికే ఈ ఎగ్జిట్ పోల్స్ పై ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ, ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు, ఇంకా ముఖ్య నేత‌లు స్పందించారు. ఈ ఎగ్జిట్‌పోల్స్ అస‌లు వాస్త‌వం లేద‌ని అన్నారు. ఈ నేప‌థ్యంలో తాజాగా ఎగ్జిట్ పోల్స్‌పై కాంగ్రెస్ సీనియ‌ర్ నేత శ‌శి థ‌రూర్ కూడా రెస్పాండ్ అయ్యారు. పోల్స్‌పై అభ్యంతరం వ్య‌క్తం చేశారు. రిజ‌ల్ట్స్ కోసం మరో మూడు రోజుల పాటు వెయిట్ చేయాల్సిందేన‌ని అన్నారు. 


ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలన్నీ త‌ప్ప‌ని అభిప్రాయ ప‌డ్డారు శ‌శిథ‌రూర్‌. వారం క్రితం ఆస్ట్రేలియాలోనూ వివిధ ఎగ్జిట్ పోల్స్ ఫ‌లితాలు ఒక విధంగా ఉంటే.. ఫ‌లితాలు మాత్రం అందుకు భిన్నంగా వ‌చ్చాయ‌ని ఆయ‌న అన్నారు. ఇక మ‌న భార‌త్ లో చూస‌కుంటే.. ఓట‌ర్లు చాలా మంది తామెవ‌రికి ఓటేశామో చెప్ప‌ర‌ని.. ఈ విష‌యం అన్ని రాజ‌కీయ పార్టీ నేత‌ల‌కు తెలుస‌ని అన్నారు. 


ఎందుకంటే.. అది స్థానిక నేత‌లు ఏం చేస్తారోన‌న్న భయంతో చెప్ప‌కుండా ఉండొచ్చు.. లేదా ప్ర‌భుత్వానికి భ‌య‌ప‌డి ఉండొచ్చు.. ఈ విష‌యం అంద‌రికీ బాగా తెలుస‌ని తాను అనుకుంటున్న‌ట్లు చెప్పారు శశిథ‌రూర్‌.. ఇక ఎగ్జాట్ రిజ‌ల్ట్స్ కావాలంటే మాత్రం మ‌రో మూడు రోజుల పాటు ఆగాల్సిందేన‌ని స్ప‌ష్టం చేశారు. మే 23న అభ్య‌ర్థుల భ‌విత‌వ్యం తేలిపోనున్న‌ట్లు చెప్పారు. 


కాగా.. సార్వ‌త్రిక ఎల‌క్ష‌న్స్ లో భాగంగా శ‌శి థ‌రూర్ కేర‌ళ‌లోని తిరువ‌నంతపురం లోక్‌స‌భ సీటు నుంచి పోటీ చేశారు. ఈ నేప‌థ్యంలో ఈ ప్లేస్‌లో థ‌రూర్ బ‌రిలో ఉండ‌డం ఇది థ‌ర్డ్ టైమ్‌.. 

మరింత సమాచారం తెలుసుకోండి: