మూడు నెలల క్రితం ఏపిలో ఎంత హంగామాగా ఉందో అందరికీ తెలిసిందే.  ఎక్కడ చూసినా మైకుల మోతలు..పెద్ద పెద్ద నేతలు పదమూడు జిల్లాలు పర్యటించి తమ పార్టీ పరిపాలనలోకి వస్తే ఏం చేస్తారో ప్రజలకు తెలియజేశారు.  ప్రత్యర్థి పార్టీలపై తమదైన శైలిలో విరుచుకు పడ్డారు.  టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీ అధినేతలు ప్రజల్లో తమ పార్టీపై విశ్వాసం తెచ్చుకోవడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేశారో అన్నిరకాల ప్రయత్నాలు చేశారు. ఇక సందిట్లో సడేమియాల ప్రజాశాంతి పార్టీ అధినే బోధకుడు కె.ఎ.పాల్ రంగంలోకి దిగారు. 

తానే కాబోయే సీఎం అని..ఇప్పటి వరకు టీడీపీ, వైసీపీ వల్ల ప్రజలకు వొరిగిందేమీ లేదని..పవన్ కళ్యాన్ సినిమాల్లో డ్యాన్స్ చేస్తారు..రాజకీయాల్లో చేయడని ప్రచారం చేస్తూ వచ్చారు పాల్.  ఈ నేపథ్యంలో మరో రెండు రోజుల్లో ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి..ఇప్పటికే ప్రముఖ పత్రికలు, ఛానల్స్ సర్వేలు నిర్వహించి హంగామా సృష్టిస్తున్నారు.  తాజాగా భారత ఎగ్జిట్ పోల్స్ తనను షాకింగ్ కు గురిచేశాయని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలిపారు.

ఈ ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం)న్నీ ట్యాంపరింగ్ కు గురి అయ్యాయని ఆరోపించారు. నర్సాపురం లోక్ సభ స్థానంలో తనకు చాలా ఫిర్యాదులు వచ్చాయనీ, తాము హెలికాప్టర్ గుర్తుకు(12వ సంఖ్య)కు ఓటు వేస్తే ఫ్యాను(వైసీపీ గుర్తు- నంబర్ 2)కు పడిందని ప్రజలు ఫిర్యాదు చేశారని వ్యాఖ్యానించారు.  కపిల్ సిబల్ లాంటి  వ్యక్తులు చెప్పినదాని ప్రకారం అమెరికా ఇంటెలిజెన్స్, రష్యన్ హ్యాకర్ల పాత్ర ఈ ఎన్నికల్లో ఉన్నట్లు స్పష్టమయింది. నేను ఇంకా ఇండియాలోనే ఉన్నాను.

ఏపీలో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఈసీని కోరుతున్నా.  ఏదేమయినా ఏపీలో మనకు 30 ప్లస్ సీట్లు వస్తాయి. టీడీపీకి 90-100 సీట్లు వచ్చినా, లేక వైసీపీకి 90-100 సీట్లు వచ్చినా మన 30 స్థానాలు మనకే ఉంటాయి’ అని చెప్పారు. ఎగ్జిట్ పోల్స్ పై దీన్నే తన కామెంట్ గా పరిగణించాలని మీడియా ఛానల్స్ కు విజ్ఞప్తి చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: