పనిచేయ చేతగాని పనివాళ్లు తప్పు పరికరాలపై నెట్టేస్తారు. అలాగే మన లోపల మరుగుపడో పోగుపడో ఉన్న నిరాశ నిస్పృహలు మన మాటల్లో వ్యక్తమౌతాయి. ఉదాహరణ కు ప్రస్తుతం చంద్రబాబు మానసిక స్వభావం వ్యక్తమైంది. నూటికి వెయ్యిశాతం తెలుగుదేశం గెలుస్తుందని  ఆయన అన్నారు. ఇక్కడ నూటికి నూరు మార్కులు ఉంటాయి కాని నూటికి వెయ్యి శాతం అనే మాట ఆ వ్యక్తిలో ఉన్న నిరాశ నిస్పృహల నుండే వచ్చేమాట. నూటికి వెయ్యి శాతం అనేది పూర్తిగా "ఊహాజనితం" అంటే అసంభవం అంటే హైపోతెటికల్.    
 
అదే సమయంలో ఆయన వివిపాట్ స్లిప్పులు ఏభైశాతం లెక్కించాలని, ఈవిఎమ్లపై సందేహాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. తమ గెలుపులో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని ఆయన అన్నారు. అసలు ప్రజలకు అంటే ఓటేసిన ఓటర్లకు లేని అనుమానం వాటిని ప్రవేశ పెట్టిన లా మేకర్లు వెలిబుచ్చటం మన దౌర్భాగ్యం కాక ఇంకేమీ కాదు. 
Image result for whether 1000% is possible as its chandrababu comment
తాను ఒక్క పిలుపు ఇస్తే వరదలా వచ్చి ఓటేశారని ఆయన చెప్పుకున్నారు. సర్వేలు చేయడం ప్రతి ఒక్కరికి అలవాటుగా మారిందన్నారు. ఐదేళ్లలో జరిగిన సంక్షేమం ఎప్పుడూ జరగలేదని, ఇందులో ఒక్కశాతం కూడా అనుమానం లేదన్నారు. వంద శాతం టీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, టెక్నాలజీకి బానిసగా మారొద్దని, బలిపశువులు కావొద్దని, చంద్రబాబు నాయుడు సూచించారు. 

గతంలో ఈవీఎంలో ఎవరికి ఓటు పడిందో తెలిసేది కాదన్నారు.ఎన్నికల్లో పారదర్శకత ఉండాలి. వీవీప్యాట్‌ స్లిప్పులను లెక్కించడానికి అభ్యంతరమేంటి?. అధికారంలో ఉన్నా కూడా ఈవీఎం లపై పోరాడుతున్నాను. శాంపుల్ గా ఐదు బూత్‌ లను కౌంట్‌ చేయాలని సుప్రీంకోర్టు చెప్పింది. వీవీప్యాట్‌ స్లిప్పుల లెక్కింపునకు ఆరు రోజులు పడుతుందని చెప్పారు. వీవీప్యాట్‌ ప్రింటర్‌ ను మేనేజ్‌ చేసే అవకాశాలు ఉన్నాయని ఆయన తాజాగా ఆరోపించారు. 
Image result for whether 1000% is possible as its chandrababu comment
అయితే మరి ఈ టిడిపి అధినేత మూడు సార్లు ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చారు కదా! అప్పుడు టెక్నాలజీని మానేజ్ చేసే వచ్చారా? అనేది దేశానికి సాంకేతికతను పరిచయం చేసిన ఈ మహనీయుడు ఆ సాంకేతికతనే నమ్మకపోవటంలోని ఔచిత్యం ఏమిటో ఎవరికీ అర్ధంకావటం లేదు. 1000% గెలుపుపై నమ్మకమున్నప్పుడు అధికారం లోకి వచ్చి కొత్త చట్టం చెసుకుంటే మంచిది కదా! 
 


మరింత సమాచారం తెలుసుకోండి: