కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ మ‌రోసారి హాట్ కామెంట్స్ చేశారు..  ఈ సారి కూడా ప్ర‌ధాన మంత్రిగా న‌రేంద్ర మోదీ సార‌థ్యంలో ఎన్డీయేకే ప్ర‌జ‌లు ప‌ట్టం క‌ట్టార‌ని నిన్న విడుద‌లై ఎగ్జిట్ పోల్స్ లో తేలిన‌ట్లు చెప్పారు. కాగా.. నిన్న సార్వత్రిక ఎన్నిక‌లు ముగిసిన అనంత‌రం ఎగ్జిట్ పోల్స్ రిజ‌ల్ట్స్ విడుద‌లైన విష‌యం తెలిసిందే.. అయితే అందులో అధికార పార్టీకే మెజార్టీ వ‌స్తుంద‌ని దాదాపు అన్ని స‌ర్వేల్లో వెల్ల‌డ‌య్యాయి. 

ఈ నేప‌థ్యంలో ఆదివారం విడుద‌లైన ఎగ్జిట్ పోల్స్ పై గిరిరాజ్ సింగ్ స్పందించారు. ఈ మేర‌కు ఆయ‌న ఓ ట్వీట్ కూడా చేశారు. ఈ సారి కూడా ఎన్డీయేనే అధికారంలోకి రాబోతోన్న‌ట్లు ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెప్పాయ‌ని అన్నారు ఆయ‌న‌. ఎగ్జిట్ పోల్స్ ఫ‌లితాలు చూసిన విప‌క్ష‌లు జీర్ణించుకోలేక పోతున్నాయ‌ని అన్నారు.


ఎగ్జిట్ పోల్స్ రిజ‌ల్ట్స్ నేప‌థ్యంలో వాటిని చూసిన త‌ర్వాత మ‌మ‌తా బెన‌ర్జీ, చంద్ర‌బాబు స‌హా విప‌క్ష పార్టీల‌న్నీ ఐసీయూలో చేరాయ‌ని వ్యాఖ్యానించారు గిరిరాజ్ సింగ్‌. ఇక ఈ ఎగ్జిట్ పోల్స్ ఫ‌లితాల‌ను కొంద‌రైతే త‌ప్ప‌ని వ్యాఖ్యానిస్తున్నార‌ని చెప్పిన ఆయ‌న‌.. మే 23న అస‌లు ఫ‌లితాల్లో కూడా ఇదే రిపీట్ అవుతుంద‌ని నొక్కి చెప్పారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: