నిన్న ఎగ్జిట్ పోల్ రిజ‌ల్ట్ వ‌చ్చింది. నేడు జ‌న‌సేన్యం .. భీమ‌వ‌రానికి దండెత్తింది. ఈ రెండింటికీ మ‌ధ్య ఏదైనా సంబంధం ఉందా? ఏదైనా రీజ‌న్ ఉందా? అనే సందేహాలు తెర‌మీదికి వ‌స్తున్నాయి. ఏపీలో జ‌రిగిన తాజా ఎన్నిక‌ల్లో ముచ్చ‌ట‌గా మూ డో పార్టీగాఅవ‌త‌రించిన జ‌న‌సేన భారీ ఎత్తున ప్ర‌భావం చూపుతుంద‌ని అంద‌రూ అనుకున్నారు. 2017-18 మ‌ధ్య కాలంలో అయితే, ఏకంగా జ‌న‌సేనాని ప‌వ‌న్ అధికారంలోకి వ‌చ్చేస్తాడ‌ని, సీఎం కూడా అయిపోతాడ‌ని భావించారు. అయితే, రాను రాను త‌న స్వ‌యం శ‌క్తిని తానే గుర్తించుకోలేక పోయిన ప‌వ‌న్ ప‌రిస్థితి ఎన్నిక‌ల నాటికి నానాటికీ తీసిక‌ట్టుగా మారిపోయిం ది. ఈ ప‌రిణామం తో జ‌న‌సైన్యం త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డింది. 


ఇక‌, తాజాగా రాష్ట్రంలో ఎన్నిక‌లు జ‌రిగి 40 రోజులు పూర్త‌యినా కూడా ఫ‌లితంపై మాత్రం ఉత్కంఠ కొన‌సాగుతూనే ఉంది. నువ్వా-నేనా అనేరేంజ్‌లో సాగిన ఎన్నిక‌ల ప‌ర్వంలో.. జ‌న‌సేన కూడా భారీగానే ఆశ‌లు పెట్టుకుంది. క‌నీసం రెండంకెల ఫ‌లితాలు ఖాయ‌మ‌ని కొంద‌రు, లేదు మూడు ప‌దుల సీట్లు ఖాయ‌మ‌ని మ‌రికొంద‌రు లెక్క‌లు వేసుకున్నారు. ఈ నేప‌థ్యం లోనే జ‌న‌సేన ఖ‌చ్చితంగా 20 స్థానాల్లో గెల‌వ‌డం, రాష్ట్రంలో అధికారంలోకి వ‌చ్చే పార్టీని నిర్ణ‌యించ‌డం వంటి కీల‌క రోల్ పోషిస్తుంద‌ని జోస్యం చెప్పిన నాయ‌కులు కూడా తెర‌మీదికి వ‌చ్చారు. అయితే,తాజాగా ఎగ్జిట్ పోల్ స‌ర్వేలు తెర‌మీదికి వ‌చ్చాయి. దీంతో జ‌న‌సేన నాయ‌కులు, అభిమానులు కూడా త‌ర్జ‌న భ‌ర్జ‌న‌ప‌డుతున్నారు. 


ఏ స‌ర్వే కూడా ప‌ట్టుమ‌ని ప‌ది స్థానాల‌ను జ‌న‌సేన‌కు క‌ట్ట‌బెట్ట‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, ఎంతో కీల‌క‌మ‌ని చెప్పుకొన్ని ఆర్జీస్ స‌ర్వేలోనూ కేవ‌లం ఒకే ఒక్క‌స్థానం జ‌న‌సేన‌కు ద‌క్కుతుంద‌ని చెప్ప‌డంతో జ‌న‌సేన అభిమానులు న‌ర్వేదంలో మునిగిపోయారు. అయితే, ఆ ఒక్క‌సీటు ప‌వ‌న్‌దేన‌ని తెలియ‌డం ఒకింత సంతోష‌క‌రంగా మారింది.అదికూడా భీమ‌వ‌ర‌మేన‌ని ప్ర‌చారం సాగుతుండ‌డం ఇక్క‌డ నుంచి అసెంబ్లీకి ప‌వ‌న్‌, పార్లెమెంటు స్థానానికి ఆయ‌న సోద‌రుడు నాగ‌బాబు పోటీ చేయ‌డంతో ఈ ఇద్ద‌రిలో ఒక‌రు గెలిచే అవ‌కాశం ఉంద‌ని భావించిన కార్య‌క‌ర్త‌లు, అభిమానులు ఇప్పుడు ఫ‌లితాల అనంత‌రం భారీ ఎత్తున సంబ‌రాలు చేసుకునేందుకు భీమ‌వ‌రం బాట ప‌డుతున్నారు. సో.. ఇదీ స్టోరీ! 


మరింత సమాచారం తెలుసుకోండి: