ఏపీ సీఎం చంద్రబాబు ఓడిపోబోతున్నాడు.. ఇదీ ఇప్పుడు ఏపీలో చాలామంది నోట నలుగుతున్న మాట. ఎన్నికల ముందు సర్వేలు.. ఎన్నికల తర్వాత సర్వేలు.. ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఇదే విషయాన్ని చెబుతున్నాయి. మరి ఈ ఓటమికి కారణం ఏంటి..?


సహజంగా ఎన్నికలంటే ప్రోగ్రెస్ రిపోర్ట్ లాంటివి.. విద్యార్ధి చదివితే పాసవుతాడు.. నాయకుడు బాగా పాలిస్తే మళ్లీ నెగ్గుతాడు.. అంతే కదా.. మరి ఇప్పుడు చంద్రబాబు ఓడితే అందుకు కారణం ఆయన పాలన బాగా లేదనేగా.. కానీ ఆ మాట చెప్పడం ఆంధ్రజ్యోతికి చాలా ఇబ్బందికరం కదా.

అందుకే.. కొత్త కారణం రెడీ చేసింది.. అదేంటంటే.. ఏపీ సెక్రటేరియల్ భవనాల వాస్తుల అస్సలు బాగా లేదట. ఈ విషయాన్ని ఓ ప్రముఖ వాస్తు సిద్ధాంతి సెలవిచ్చారట. ప్రముఖ వాస్తు సిద్ధాంతి గోటూరి పాములు ఏమన్నారంటే.. 

అమరావతిలో ప్రభుత్వ కార్యాలయాలు, సెక్రటేరియట్ నిర్మాణాల విషయంలో వాస్తు దోషాలు ఉన్నాయట.  ముఖ్యంగా సెక్రటేరియట్‌‌ను నిర్మించే విషయంలో తప్పుడు వాస్తు ప్రకారం కట్టడాలు కట్టారని సిద్ధాంతి స్పష్టం చేశారు. వాస్తుకు విరుద్ధంగా కట్టడాలు నిర్మించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సో.. వాస్తు కూడా చంద్రబాబు ఓడిపోతారనే చెబుతోందన్నమాట. 



మరింత సమాచారం తెలుసుకోండి: