ఏపీ కాబోయే ముఖ్యమంత్రి జగన్.. ఇది ఇప్పుడు చాలా మంది చెబుతున్న మాట.. ఒకవేళ జగన్ సీఎం అయితే వెంటనే చేయాల్సిన అర్జంటు పని ఒకటి ఉంది. ఇడుపుల పాయ వెళ్లి రాజశేఖర్ రెడ్డి సమాధికి నివాళులు అర్పించే కంటే ముందే చేయాల్సినంత అర్జంటు పని ఇది. 


అదేంటంటే.. ఏపీ సెక్రటేరియల్ వాస్తు మార్పించడం.. అవును మరి.. ఆ వాస్తు సరిగ్గా లేకపోవడం వల్లే ఇప్పుడు చంద్రబాబు ఓడిపోతున్నాడట. ఆ వాస్తు సరిచేయించుకోకపోతే రేపు జగన్ పరిస్థితి కూడా అదేనట. ఈ విషయాన్ని ఓ సిద్ధాంతిగారు సెలవిస్తున్నారు.  

ప్రముఖ వాస్తు సిద్ధాంతి గోటూరి పాములు చెబుతున్నమాట ఇది. అమరావతిలో ప్రభుత్వ కార్యాలయాలు, సెక్రటేరియట్ నిర్మాణాల విషయంలో వాస్తు దోషాలు ఉన్నాయట.  ముఖ్యంగా సెక్రటేరియట్‌‌ను నిర్మించే విషయంలో తప్పుడు వాస్తు ప్రకారం కట్టడాలు కట్టారని సిద్ధాంతి స్పష్టం చేశారు. వాస్తుకు విరుద్ధంగా కట్టడాలు నిర్మించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

ఇలా వాస్తు వ్యతిరేకంగా నిర్మించడం ద్వారా రాబోవు ప్రభుత్వలకు నష్టాలు ఏర్పడతాయని గోటూరి పేర్కొన్నారు. " సెక్రటేరియట్ రూట్ ఎండ్‌కి కట్టారు. తప్పుడు నిర్ణయాలు ముఖ్యమంత్రి కార్యాలయం ముందు అసెంబ్లీ కట్టారు. తూర్పు మూతపడి పోయింది. దీని వలన నష్టం జరుగుతుంది. 

ఒక్క ఈశాన్య గేట్ తప్ప.. మొత్తం సెక్రటేరియట్ వాస్తు సరిగా లేదు. నిప్పు ఎవరికయినా కాలుతుంది.. అలానే తప్పుల ఎవరు చేసిన బాధ్యులు ముఖ్యమంత్రే అవుతారని తేల్చి చెప్పారు. ముక్కోణం రోడ్.. రోడ్ శుల.. సెక్రటేరియట్ వాస్తు ఖచ్చితంగా మార్చాల్సి ఉంది.. ఏ ముఖ్యమంత్రి ఈ సెక్రటేరియట్‌కి వెళ్లిన డౌన్ అయిపోతారని సిద్దాంతి తేల్చి చెప్పాడట. మరి ఇంతగా చెప్పాక జగన్ వాస్తు మార్పు చేయకుండా ఉంటాడా.. చూడాలి మరి.  



మరింత సమాచారం తెలుసుకోండి: