ఇండియాలో ప్రజాస్వామ్యం చాలా విశిష్టమైంది. మెజారిటీ నిర్ణయమే ఇక్కడ శిరోధార్యం. అందుకే ఏ ఎన్నికల్లో అయినా ఒక్క ఓటు అవతలి వ్యక్తి కంటే ఎక్కువ వచ్చినా ఆ వ్యక్తి గెలిచినట్టే.. అందుకే నేతలు చివరి వోటు కోసం కూడా శ్రమపడుతుంటారు. 


అసెంబ్లీ ఎన్నికల్లో 60- 70 వేలు మెజారీటీ తెచ్చుకున్న నాయకులు ఉన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో 5 లక్షల మెజారిటీ తెచ్చుకున్న నేతలూ ఉన్నారు. కానీ ఏపీలో ఓ నేత కేవలం 9 ఓట్ల తేడాతో గెలిచి ఎంపీగా లోక్‌సభలో అడుగుపెట్టాడు. 

ఆయనే కొణతాల రామకృష్ణ.. ఈయన కేవలం 9 ఓట్లు ఆధిక్యమే సంపాదించాడు. ఇది 1989 నాటి కథ.. అంటే సరిగ్గా ముప్పై ఏళ్ల క్రితం నాటి సంగతి అన్నమాట. ఆ ఏడాది అనకాపల్లి ఎంపీ సీటు బరిలో కాంగ్రెస్ తరుపున కొణతాల రామకృష్ణ దిగారు. 

కేవలం 9 ఓట్ల తేడాతో గెలుపొంది. దేశంలోనే అతి తక్కువ మెజారిటీ రికార్డు సాధించారు. ఇది దేశంలోనే అతి తక్కువ లోక్‌సభ ఎన్నికల మెజారిటీ రికార్డు.. ఈ రికార్డు ఇంకా అలాగే ఉంది. 1998లో బీహార్‌లో శామ్ మరాండీ కూడా కేవలం 9 ఓట్ల తేడాతోనే గెలిచాడు. 



మరింత సమాచారం తెలుసుకోండి: