ప్రొఫెసర్ నాగేశ్వర్ .. రాజకీయ విశ్లేషణలో తనకంటూ ఒక క్రెడిబిలిటీని సంపాదించుకున్నారు. ఇతని విశ్లేషణలకు జనాల్లో మంచి గురింపు ఉంది. అయితే ఈయన విశ్లేషణ ప్రకారం ఈ ఎన్నికల్లో వైసీపీకి 98 నుంచి 102 సీట్లు వస్తాయని నాగేశ్వర్ అంచనా వేశారు. అందుకు గల కారణాలను కూడా ఆయన వివరించారు. గడచిన సారి అనుభవానికి ఓటేయాలని భావించిన ఏపీ ప్రజలు చంద్రబాబుకు పాలనా పగ్గాలు అప్పగించారని అయితే ఈ సారి మాత్రం జగన్ నోట నుంచి పదే పదే వినిపించిన ‘ఒక్క ఛాన్స్‘ బాగా పనిచేసిందని ఆయన చెప్పారు.


వైసీపీకి వచ్చే స్థాయిలో సీట్లను సాధించే అవకాశాలు టీడీపీకి ఏ కోశానా లేవని కూడా ఆయన విశ్లేషించారు. జనంలో చంద్రబాబు పట్ల పెద్దగా వ్యతిరేకత లేకపోయినప్పటికీ... జగన్ కు ఒక్క అవకాశం ఇచ్చి చూద్దామన్న భావన... ఓటింగ్ సరళిగా భారీగా ప్రభావితం చేసిందని ఆయన చెప్పుకొచ్చారు. ఇక అసెంబ్లీలో జగన్ కే ఓటరు ఫేవర్ గా కనిపిస్తే... లోక్ సభ ఎన్నికల్లోనూ జగన్ పార్టీకే జనం మొగ్గారని కూడా ఆయన చెప్పారు.


జగన్ పార్టీకి ఈ దఫా ఏకంగా 15 ఎంపీ సీట్లు వచ్చే అవకాశాలున్నాయని నాగేశ్వర్ విశ్లేషించారు. ఇక ఈ ఎన్నికల్లో విజయాన్ని ప్రభావితం చేయడంలో కీలక భూమిక పోషించిందని భావిస్తున్న జనసేన... పెద్దగా ప్రభావం చూపలేకపోయిందని పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలోని ఈ పార్టీకి అసెంబ్లీలో 3 నుంచి 5 సీట్లు మాత్రమే వచ్చే అవకాశాలున్నాయని నాగేశ్వర్ తన అంచనాను చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: