తాను మెచ్చింది రంభ.. తాను మునిగింది గంగ.. అన్నట్టుంది ఏపీ సీఎం చంద్రబాబు సంగతి అని విమర్శలు వస్తున్నాయి. తమ రాజకీయ అవసరాల కోసం మనుగడ కోసం ఎలాంటి పన్నాగలకైనా పాల్పడతాడంటున్నారు కొందరు నెటిజన్లు..  
  
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2014 లో ఎక్జిట్ పోల్స్ రాగానే పెట్టాలని చెబుతున్న ట్విట్టర్ పోస్టులను షేర్ చేస్తున్నారు. 2014 ఎగ్జిట్ పోల్స్ సమయంలో దేశం మూడ్ ను ఆ ఎక్జిట్ పోల్స్ ప్రతిబింబిస్తున్నాయని ఆయన కామెంట్ చేశారు. దేశ ప్రజల మూడ్‌ను ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రతిబింబిస్తాయి. 
కాంగ్రెస్‌కు ఇండియా ఇచ్చే మెసేజ్‌.. క్విట్‌ ఇండియా! అని కూడా తన పోస్టులో తెలిపారు చంద్రబాబు. 


ఇప్పుడు అదే చంద్రబాబు 2019 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ గూటికి పరుగులు తీస్తున్నారు. పైగా ఎక్జిట్ పోల్స్ ను నమ్మవద్దని చెబుతున్నారు.పలుమార్లు ఎక్జిట్ పోల్ ప్రజల మూడ్ కనిపెట్టడంలో ఫెయిల్ అయ్యాయని చెబుతున్నారు. తాజాగా ఆయన చేసిన పోస్టులో ఈ విషయాలు పేర్కొంటున్నారు. 

అందులో ఏముందంటే.. మరోసారి ఎగ్జిట్ పోల్స్ ప్రజానాడి పట్టుకోవడంలో ఫెయిల్ అయ్యాయి. ఎగ్జిట్ పోల్స్ క్షేత్ర స్థాయిలో ఉన్న పరిస్థితిని చెప్పలేవనని ఇప్పటికే చాలా సార్లు నిరూపితమైంది. ఏపీలో మళ్లీ మేమే అధికారంలోకి వస్తాం అనుమానం లేదు. కేంద్రంలోనూ బీజేపీ యేతర ప్రభుత్వమే వస్తుంది..



మరింత సమాచారం తెలుసుకోండి: