జాతస్య మరణం ధ్రువం.. పుట్టిన వాడికి మరణం తప్పదు.. కానీ ఆ మరణం.. బతికి ఉన్న ఆ వ్యక్తి బంధువలకు భారం కాకూడదు.. అసలే ఆత్మీయుడిని కోల్పోయిన బాధలో ఉన్నవారికి అంత్యక్రియలు ఇంకో భారం కాకూడదు. ఇదే సదుద్దేశంతో ఒక్క రూపాయికే అంత్యక్రియలు నిర్వహిస్తున్నారక్కడ. 


కరీంనగర్‌ లో రూపాయికే అంత్యక్రియలు చేపట్టాలని నగరపాలక సంస్థ నిర్ణయించింది. ఈమేరకు నగర మేయర్ రవీందర్ సింగ్ తెలిపారు. నగరంలో ప్రజలు రూపాయి చెల్లిస్తే నగరపాలక సంస్థ తరపున అంత్యక్రియలు చేపడతారు.  

ఈ కార్యక్రమం కోసం కరీంనగర్ నగరపాలక సంస్థ రూ.1.50 కోట్లు కేటాయించింది. అంత్యక్రియల కోసం  ప్రత్యేకంగా రెండు వ్యాన్లు, ఫ్రీజర్, ఇతర సామాగ్రి కొనుగోలు చేస్తున్నారు. ఈ కార్యక్రమం కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తారు.  

ఇంటి దగ్గర నుంచి శ్మశానవాటిక వరకు వాహనం, దహన సంస్కారాలకు సంబంధించి ఇతర ఏర్పాట్లకయ్యే ఖర్చును నగరపాలక సంస్థనే భరిస్తుంది. నగరవాసులకు శ్మశానవాటికల్లో మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత మున్సిపాలిటీలదే అంటున్నారు మేయర్. వచ్చే నెల 15 ఈ కార్యక్రమాన్ని అమల్లోకి రానుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: