రాజకీయాల్లో కొన్ని ఆనవాయితీలు, సంప్రదాయాలు ఉంటాయి. కొన్ని పదవులపై కొన్ని వదంతులు, ప్రచారాలు సహజం. అలాంటిదే లోక్‌సభ స్పీకర్ పదవి కూడా. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో అత్యంత గౌరవనీయమైన స్థానం లోక్‌సభ స్పీకర్ ది.


కానీ పదవి చేపట్టినవారికి ఆ తర్వాత పెద్దగా ఫ్యూచర్ ఉండదని అనేక సందర్భాల్లో రుజువైందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇందుకు కొన్ని ఉదాహరణలు కూడా ఉన్నాయి. గత 16 లోక్‌సభల్లో ఒక్కరు మినహా మిగిలినవారెవ్వరినీ రెండోసారి స్పీకర్‌ పదవి వరించలేదు. 

గత 16 లోక్‌సభల్లో ఒకసారి స్పీకర్‌గా పనిచేసిన వారిలో కేవలం 10 మంది మాత్రమే తిరిగి లోక్‌సభకి ఎన్నికయ్యారు. ఒక్క నీలం సంజీవరెడ్డి మాత్రమే రెండుసార్లు స్పీకర్‌ పదవి వరించింది. 2014లో స్పీకర్‌ పదవికి ఎంపికైన ప్రస్తుత స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌‌కి ఈసారి సీటు కేటాయించలేదు.

సుమిత్రా మహాజన్‌కన్నా ముందున్న స్పీకర్‌ మీరా కుమార్‌ తొలి దళిత మహిళా స్పీకర్‌.  అంతకుముందు స్పీకర్ సోమనాథ్‌ తర్వాత తాను  ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పేశారు. ఏపీ నుంచి ఎన్నికైన స్పీకర్ జీఎంసీ బాలయోగి హెలికాప్టర్‌ ప్రమాదంలో హఠాత్తుగా మరణించారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: