చంద్రబాబు మీద ఇపుడు అందరి చూపు ఉంది. ఆయన మీదనే జాతీయ పార్టీల కన్ను, రాజకీయాల చర్చలు కూడా కేంద్రీక్రుతమై ఉన్నాయి. నలభయ్యేళ్ళ రాజకీయ జీవితం బాబుది. ఆయన పదేళ్ళ పాటు ప్రతిపక్షంలో ఉన్నారు. ఇప్పటికి కలుపుకుంటే మూడు సారులు పదమూడున్న‌రేళ్ళ పాటు సీఎం గా వ్యవహరించారు. దేశంలో  పలు సార్లు చక్రం తిప్పారు. 


అటువంటి బాబు కనుక రాజకీయాల్లో తనకంటే జూనియర్ అయిన జగన్ చేతిలో ఓడిపోతే పరిస్థితి ఏంటి. ఇది ఓ విధంగా జీర్ణించుకోలేని విషయమే. జగన్  బాబుకు కొడుకు సమానుడు. బాబు ఒకప్పటి స్నెహితుడు వైఎస్సార్ కుమారుడు. అంటే ఓ విధంగా బాలుడి చేతిలో పరాభవం అన్న మాట. దాన్ని బాబు అసలు తట్టుకోలేరు. రాజకీయల్లో గెలుపు ఓటములు ఉన్నా ఇలా జగన్ చేతిలో ఓడిపోవడం బాబు లాంటి సీనియర్ నేతకు ఘోర అవమానమే.


అదే సమయంలో కేంద్రంలో తాను వద్దనుకున్నా మోడీ మళ్ళీ రావడం కూడా బాబుకు ఇష్టం లేకపోవచ్చు. ఇక కేసీయార్ ఎటూ ఆరు నెలల ముందే సీఎం హోదాలో అధికారం రెండవమారు సంపాదించారు. ఈ నేపధ్యంలో 23న ఎన్నికల ఫలితాలో తేడా కొట్టి చంద్రబాబు కనుక ఓడిపోతే కొంతకాలం రాజకీయాలు ఫుల్ స్టాప్ పెట్టి సింగపూర్ కి కుటుంబంతో సహా వెళ్ళి సేద తీరాలనుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.


కనీసం కొన్ని నెలల పాటు అక్కడే ఉండి పరిస్థితులు అన్నీ కుదుట పడ్డాక తిరిగి ఏపీకి వచ్చి రాజకీయం మొదలుపెట్టాలన్నది బాబు వ్యూహంగా ఉందని అంటున్నారు. జగన్ కి ఓ ఆరు నెలల సమయం ఇచ్చి ఆయన పరిపాలన పట్ల జనంలో వ్యతిరేకత వస్తే దాన్ని వాడుకుని మళ్ళీ జనంలోకి వెళ్ళాలన్నది బాబు ఎత్తుగడగా చెబుతున్నారు. మొత్తానికి టీడీపీ ఓడిపోతే మాత్రం ఏపీ రాజకీయ తెరపై కొన్నాళ్ళ పాటు బాబు మాటను వినే అవకాశమైతే లేదని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: