టీవీ9 మాజీ సీఈఓ ర‌విప్ర‌కాశ్ కేసు మ‌లుపులు తిరుగుతోంది. సైబర్‌క్రైం నేరాలతోపాటు చీటింగ్ తదితర సెక్షన్ల కింద కేసుల్లో విచారణకు హాజరుకావాల్సిందిగా సైబర్‌క్రైం పోలీసులు ఇచ్చిన నోటీసులకు స్పందించకుండా రవిప్రకాశ్ తప్పించుకుని తిరుగుతున్నారు. దీంతో ఆయనను అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలు వివిధ రాష్ర్టాల్లో గాలిస్తున్నాయి.  కేసులు నమోదై పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్న రవిప్రకాశ్ బెయిల్ కోసం విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అయితే, ఆయ‌న‌కు ఊహించ‌ని షాక్ త‌గిలింది.


ర‌విప్ర‌కాశ్ ముందస్తు బెయిల్ కోసం సోమవారం హైకోర్టులో పిటిషన్ దాఖలుచేశారు. అసోసియేటెడ్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ (ఏబీసీపీఎల్) మేనేజ్‌మెంట్‌ను అక్రమంగా టేకోవర్ చే యడానికి సంబంధించిన కేసు ఒకటి నేషనల్ కంపెనీ లా ట్రి బ్యునల్ (ఎన్‌సీఎల్టీ)లో పెండింగ్‌లో ఉన్నదని.. ఆ కేసులో తా ము ముందుకు వెళ్లకుండా బెదిరించేందుకు తప్పుడు ఫిర్యాదులు చేశారని రవిప్రకాశ్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఫిర్యాదుదారులు చేసిన ఆరోపణలు కుట్రపూరితంగా చేసినవేనని ప్రాథమికంగా అర్థమవుతున్నదని తెలిపారు. ముందస్తు బెయిల్ మంజూరైన తర్వాత పోలీసుల దర్యాప్తునకు సహకరిస్తానని కోర్టుకు విన్నవించారు. కేసు బుధవా రం (22న) వేసవిసెలవుల ప్రత్యేక ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చే అవకాశం ఉంది.


మ‌రోవైపు సైబరాబాద్ సైబర్‌క్రైం పోలీసులు టీవీ9 మాజీ సీఎఫ్‌వో ఎంవీకేఎన్ మూర్తిని సోమవారం మరోసారి ప్రశ్నించారు. ఆయన వరుసగా పదోసారి పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. అలంద మీడియా సంస్థ డైరెక్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదైన రెండుకేసుల్లో రవిప్రకాశ్, శివా జీ నకిలీపత్రాల సృష్టి, ఫోర్జరీ సంతకాల వ్యవహరంలో 10 మంది సాక్షుల నుంచి పోలీసులు స్టేట్‌మెంట్లను రికార్డు చేయగా.. మరో 20 మందిని ప్రశ్నించి వివరాలు సేకరించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: