ఏపీలో జగన్ గెలుస్తాడన్న నమ్మకం వైకాపాలో బాగా పెరిగింది. ఎగ్జిట్ పోల్స్ తర్వాత ఈ జోరు మరికాస్త ఎక్కువైంది. ఆ పార్టీ ఏం చేయబోతోంది.. కేబినెట్‌లో ఎవరికి స్థానం దక్కుకుంది అన్న అంశాలపై వెబ్ మీడియా కూడా జోరుగా కథనాలు ఇస్తోంది.


ఐతే.. జగన్ కేబినెట్‌ ఏర్పాటు పై చంద్రబాబు కూడా స్పందించారు. వైసీపీ నేతలు ఊహల్లో బతుకుతున్నారని చంద్రబాబు అంటున్నారు. ఇంగ్లీష్ టీవీ ఛానళ్ల ఎగ్జిట్‌ పోల్స్‌, కొన్ని సంస్థల సర్వేల్లో 2014లోనూ వైసీపీ  అధికారంలోకి వస్తుందని చెప్పడమే ఇందుకు కారణమంటున్నారు. 

వైకాపా నేతలు ఎగ్జిట్  పోల్‌ తర్వాత ఏకంగా ఊహల్లోకి వెళ్లి మంత్రివర్గాన్ని కూడా తయారు చేసుకున్నారని చంద్రబాబు విమర్సిస్తున్నారు. గతంలోనూ జగన్ ఇలాగే చేశారని..  ఇప్పుడూ అదే చేస్తున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. 

ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలను చూసి వైసీపీ వారు ఆనందపడుతున్నారు. దేనికో అర్థం కావడం లేదు. బీజేపీ నాయకులైతే ప్రతిపక్షం రాజకీయ ఐసీయూలోకి వెళ్లిందంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు.. అంటూ ఆ రెండు పార్టీలపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: