ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు ఓటమికి సిద్ధపడిపోయారా.. ఎగ్జిట్ పోల్ తర్వాత ఓటమి తర్వాత ఏం చెప్పాలో ఓ క్లారిటీకి వచ్చేశారా.. జనంలోకి ఎలా వెళ్లాలో ముందుగానే నిర్ణయించేసుకున్నారా.. ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది. 


ఇందుకు తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలే నిదర్శనంగా కనిపిస్తున్నాయి. తాజా ఆయన ఏమన్నారంటే.. "ప్రతి ఎన్నికల్లోను సర్వేలు చేస్తూనే ఉంటారు. మాకు సర్వేలు కొత్త కాదు. ఈ ఎన్నికల్లో ప్రజలు తెదేపాకే ఓటేశారని చెప్పేందుకు బలమైన దృష్టాంతాలున్నాయి అని చంద్రబాబు పేర్కొన్నారు.

అక్కడితో ఆగకుండా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహిస్తే సరే..! ప్రజాస్వామ్యంలో ప్రజాతీర్పును ఎవరైనా గౌరవించాల్సిందే. కానీ ఈ ఎన్నికల ప్రక్రియను ఈసీ గందరగోళంగా మార్చేసింది. ఈసీ అనుసరిస్తున్న విధానాలపై అందులోని అధికారే అసంతృప్తి వ్యక్తం చేసేపరిస్థితికి వచ్చారు.

ఇవన్నీ ఈసీ విశ్వసనీయత కోల్పోవడానికి కారణాలు. ఎన్నికల ప్రచారానికి విపక్షాలు ఎంత కష్టపడ్డాయో, ఈసీ విధానాలపై పోరాటానికి అంత కష్టపడ్డాయి అని చంద్రబాబు కామెంట్ చేశారు. దీన్ని బట్టి చూస్తే  చంద్రబాబు తన ఓటమికి ఈసీనే బాధ్యురాలిని చేసేలా ఉన్నారని అనిపిస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: