సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డే త‌రుణంలో...కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. ఆదాయానికి మించి ఆస్తులు క‌లిగి ఉన్న కేసులో స‌మాజ్‌వాదీ పార్టీ నేత ములాయం సింగ్ యాద‌వ్‌, ఆయ‌న కుమారుడు అఖిలేశ్ యాద‌వ్‌కు ఊర‌ట ల‌భించింది. ఆ కేసులో సీబీఐ ఇద్ద‌రు నేత‌ల‌కు క్లీన్ చిట్ ఇచ్చింది. ఆదాయానికి మించి ఆస్తులు క‌లిగిన కేసును 2013 ఆగ‌స్టులో మూసివేశామ‌ని సీబీఐ సుప్రీంకోర్టుకు స‌మ‌ర్పించిన అఫిడ‌విట్‌లో తెలిపింది. 


ఆదాయానికి మించి వీరిద్దరూ ఆస్తులను కూడబెట్టిన కేసుకు సంబంధించి ప్ర‌స్తుత ప‌రిస్థితిపై రిపోర్ట్ ఇవ్వాల‌ని కోర‌గా.. సుప్రీంకు సీబీఐ ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది. ములాయం, అఖిలేశ్ వ‌ద్ద ఆదాయానికి మించిన ఆస్తులు క‌లిగి ఉన్న‌ట్లు త‌మ‌కు ఆధారాలు దొర‌క‌లేద‌ని సీబీఐ త‌న రిపోర్ట్‌లో వెల్ల‌డించింది. కాగా, ఎగ్జిట్ పోల్స్ వెలువ‌డిన కొద్దిరోజుల‌కే సీబీఐ ఈ మేర‌కు రిపోర్ట్ ఇవ్వ‌డంపై చ‌ర్చోప‌చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: