జగన్ ఈ మూడు అక్షరాలు ముప్పై ఏళ్ల  పార్టీ ని నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న నాయకుడిని ఓడించే స్థాయికి చేరుకున్నాడు. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఎక్కువ ఎంపీ సీట్లను సాధించినా - వైఎస్ జగన్ వంటి తటస్థ పార్టీల మద్దతుపై వివిధ అంశాల్లో ఆధారపడాల్సి రావొచ్చు. హంగ్ పరిస్థితే వస్తే అప్పుడు జగన్ ఎటు వైపు మొగ్గితే వారికే ప్రధానమంత్రి పదవి దక్కే అవకాశాలు కూడా ఉంటాయి.ఆ పరిణామాల నేపథ్యంలో జగన్ మోహన్ రెడ్డి దేశంలోనే ఒక ప్రముఖ రాజకీయ శక్తిగా నిలిచే అవకాశం ఉంది.


కేంద్రంలో చక్రం తిప్పే అవకాశం వస్తే ముందుగా రాష్ట్ర ప్రయోజనాలకే ప్రాధాన్యత అని రాష్ట్రానికి ప్రత్యేకహోదాను తీసుకొస్తామని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇది  వరకే స్పష్టం చేశారు.జగన్ కు ఆ అవకాశం వచ్చి - ప్రత్యేకహోదాను తీసుకొస్తే.. అది రాజకీయంగా ఆయనకు అతి పెద్ద విజయం అవుతుంది. ప్రజల గుండెల్లో జగన్ కు చెరగని స్థానం కూడా ఏర్పడుతుంది. జగన్ నాయకత్వ పటిమకు అదే నిదర్శనం అవుతుంది కూడా.


ప్రజలు ఆదరించినందుకు జగన్ అలా రుణం తీర్చుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి.సోనియాకు భయపడో.. కేసులు వస్తాయనో వేధింపులకు వెరిసి ఉంటే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు ఈ స్థాయికి ఎదిగే వారు కాదు. అన్నింటికీ తట్టుకుని స్థైర్యంగా నిలబడిన వైఎస్ జగన్ రాజకీయ అధికారాన్ని సాధించుకుని సూపర్ పవర్ గా నిలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇప్పటి వరకూ జగన్ వ్యవహరించిన తీరును చూస్తుంటే.. సీఎం హోదాలో కూడా జగన్ చక్కగా నెట్టుకువచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: