తన స్వార్ధం కోసం చంద్రబాబునాయుడు మిత్రుల పరువును కూడా గంగలో కలిపేస్తున్నట్లుంది చూడబోతే.  మామూలుగానే రేపటి కౌంటింగ్ లో టిడిపి మళ్ళీ గెలిచే అవకాశం కనబడలేదు. దాన్నే ఎగ్జిట్ పోల్ సర్వేలు కూడా ధృవీకరించింది. దాంతో తన ఓటమికి ఈవిఎంలే కారణమన్నట్లు వేదికను సిద్దం చేసుకుంటున్నారు చంద్రబాబు. తెలిసో తెలీకో ఢిల్లీలో మిత్ర పక్షాల నేతలు కూడా చంద్రబాబుతో చేతులు కలిపి తమ పరువును పోగొట్టుకుంటున్నారు.

 

ఈవిఎంలు, వివిప్యాట్ల లెక్కింపుపై ఇప్పటికే చంద్రబాబు వేసిన రెండు పిటీషన్లను సుప్రింకోర్టు కొట్టేసింది. ఎన్నికల ప్రక్రియకు సంబంధించి అంతిమ నిర్ణయం ఎలక్షన్ కమీషన్ దే అంటూ చంద్రబాబు వేసిన కేసును విచారణ కూడా జరపకుండానే కోర్టు కొట్టేసింది. తాజాగా మంగళవారం దాఖలైన ఇదే కేసును కొట్టేస్తు సుప్రింకోర్టు న్యూసెన్స్ పిటీషన్ అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం అందరూ చూసిందే.

 

ఒకవైపు న్యాయస్ధానాలు వివి ప్యాట్ల అంశాన్ని కొట్టేస్తుంటే చంద్రబాబేమో మళ్ళీ మళ్ళీ అదే అంశాన్ని కోర్టుల్లో ప్రశ్నిస్తున్నారు. తాను కోర్టుకెక్కటమే కాకుండా ఇదే అంశంపై యూపిఏలోని భాగస్వామ్య పార్టీలతో పాటు తటస్తులను కూడా బురదలోకి లాగుతున్నారు. ఢిల్లీలో 21 మిత్రపక్షాల అధినేతలతో కాన్సిస్ట్యూషన్ క్లబ్ లో సమావేశం జరిగింది. రాహూల్ గాంధి, శరద్ పవార్, మమతాబెనర్జీ, మాయావతి, అఖిలేష్ యాదవ్, స్టాలిన్, కుమారస్వామి లాంటి కీలక నేతలెవరూ సమావేశానికి హజరుకాలేదు.

 

ఓట్ల లెక్కింపులో ముందుగా వివి ప్యాట్లను లెక్కించాలన్నది చంద్రబాబు డిమాండ్. తర్వాతే ఈవిఎంల్లోని ఓట్లను లెక్కించాలట. అలాగే రెండింటిలో తేడాలొస్తే నియోజకవర్గంలోని అన్నీ పోలింగ్ కేంద్రాల ఈవిఎంల్లోని వివి ప్యాట్లను లెక్కించాలట. చివరగా ప్రతీ వివి ప్యాట్ ను బ్యాలెట్ బాక్సుల్లో వేయాలట. అసలు బ్యాలెట్ బాక్సులే లేనపుడు ఇక వివి ప్యాట్లను బ్యాలెట్ బాక్సుల్లో వేయటమేంటో ఎవరికీ అర్ధం కావటం లేదు.

 

ఓటమి భయంతోనే లాజికల్ గా సాధ్యం కాని అంశాలను పట్టుకుని చంద్రబాబు ఊగుతున్నారని అందరికీ అర్ధమైపోతోంది. మరి మిత్రులు కూడా చంద్రబాబు చెప్పిన దానికి ఎలా తలూపుతున్నారో అర్ధం కావటం లేదు. నిజంగా ఈవిఎంలు, వివి ప్యాట్ల విషయం చంద్రబాబు తప్ప మిత్రులెవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఈ విషయం అటు తిరిగి ఇటు తిరిగి చివరకు ఎలక్షన్ కమీషన్ దగ్గరకే వస్తుంది. ఎలక్షన్ కమీషన్ చంద్రబాబు అండ్ కో డిమాండ్ ను పట్టించుకునే అవకాశమే కనిపించటం లేదు. చంద్రబాబుతో కలిసినందుకు  మిత్రుల పరువు గంగలో కలవటం ఖాయంగానే తోస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: