దేశ వ్యాప్తంగా ప్రతి పక్షాలన్నీ ప్రాంతీయ పార్టీలతో సహా కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధి నాయకత్వాన్ని హర్షించే లాగా లేవు. వాళ్ళంతా నరేంద్ర మోడీ నాయకత్వాన్ని      వ్యతిరేఖించినా రాహుల్ నాయకత్వాన్ని అందరూ అంగీకరించట్లేదు. ఇందులో మమత, మాయ, బాబు, శరద్ పవార్ ఇలా ఇంకొందరు కూడా ప్రధాని పదవి కోసం అర్రులు చాస్తున్నవారే.

Image result for chandrababu working as political assistant to Rahul gandhi

అయితే చంద్రబాబు పార్టీకి రాష్ట్రం లోనే ఆదరణలేదని తేలటం, అనేక అవినీతి ఆరోపణలు ఆయనను, ఆయన కుమారుడు లోకెష్ ను, ఆయన పార్టీ, ప్రజా ప్రతినిధుల ను, కార్యకర్తలను ఆయనను అనుసరిస్తున్న అధికారులను, కమ్ముకొని ఉన్నాయి. అందుకే నరేంద్ర మోడీ అధికారంలోకి వస్తే ఆ అవినీతి కాలసర్పాలు చంద్రబాబు అండ్ కో ను కాటెయ్యకమానవు అని తెలుసుకున్న చంద్రబాబు దిక్కూ దివాణం లేని పరిస్థితుల్లో కాంగ్రెస్ శరణు జొచ్చి రాహుల్ తరపు నుండి బాధ్యతలు తన భుజస్కంధాలపై ఎవరూ కోరకుండానే వేసుకున్నాడు. ఈ పనిచేయటానికి కాంగ్రెస్ లో ఎందరో ఉన్నా చంద్రబాబు తనకై తాను రాహుల్ కు దాసుడైనారు. హత విధీ!  టిడిపికెంత దుర్గతి పట్టిందే!      

Image result for chandrababu working as political assistant to Rahul gandhi

దేశవ్యాప్త సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మే 23న వెలువడుతాయి. అలాగే కొన్ని రాష్ట్రాల ఎన్నికల ఎన్నికల ఫలితాలు కూడా. ఇప్పటికే పోయిన ఆదివారం ఎగ్జిట్-పోల్స్ వచ్చేశాయి. అయితే దేశంలో మరోసారి బీజేపీదే అధికారమని ఎగ్జిట్-పోల్స్ తేల్చిచెప్పేశాయి. ఆ ఫలితాల ప్రభావంతో ఎన్ డీఏ ప్రత్యర్థి ప్రతిపక్షాలు ప్రాంతీయ పార్టీలు  మొఖం మీద కత్తివేటుకు నెత్తురు చుక్కలేకుండా - కాంగ్రెస్ తో కలసి దిగాలు పడిపోయాయి. కానీ ఏపి ముఖ్యమంత్రి టిడిపి అధినేత చంద్రబాబు గారు మాత్రం గుండెల్లో అగ్ని జ్వాలలు చెలరేగుతున్నా పైకి మాత్రం మేకపోతు గాంభీర్యం వహిస్తూ ఇంకా వారందరినీ కూడగట్టే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.

Image result for chandrababu working as political assistant to Rahul gandhi

మమతా బెనర్జీ - మాయావతి - అఖిలేష్ యాదవ్ ల వద్దకు కాంగ్రెస్ ప్రతినిధిగా కాలికి బలపం కట్టుకొని పిచ్చి తిరుగుళ్ళు తిరుగుతున్నారు చంద్రబాబు. వీరిలో ఎవరికీ రాహుల్ గాంధి ప్రధాని కావటం ఇష్టం లేదు. వారి నుంచి పెద్దగా స్పందన అయితే రావడం లేదు. ఇది చంద్రబాబు కోల్పోతున్న ప్రతిష్టకు నిదర్శనం. 


తాజాగా బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీని కలిసిన చంద్రబాబు ఒక్కటే ప్రతిపాదన పెట్టాడట, దేశం లోని నరేంద్ర మోడీ వ్యతిరేఖులు, ప్రాంతీయ పార్టీలన్నీ కలసి రాహుల్ సారధ్యంలోని కాంగ్రెస్కి మద్దతిస్తూ రాష్ట్రపతిని కలవాలని తీవ్రమైన ఒత్తిడి తెచ్చాడట. లేకపోతే కేంద్రంలో ఒకవేళ హంగ్ వస్తే బీజేపీనే రాష్ట్రపతి అహ్వానిస్తాడట గద్దెనెక్కగానే నరేంద్ర మోడీ ప్రాంతీయ పార్టీలకు గాలం వేసి వాటిని బీజేపీ కూటమి అదే ఎన్డీఏలో చేర్చుకొని మరో ఐదేళ్లు అధికారం చెలాయిస్తాడని చంద్రబాబు వారివద్ద ఆందోళన వ్యక్తం చేస్తూ ధారుణంగా ప్రాదేయ పడుతున్నారట. మన లోక్-సభ సభ్యులను కూడా ఆకర్షించి తన పార్టీలోకి లాగేసుకొనే విష సంప్రదాయానికి తెరతీస్తాడని చంద్రబాబు ప్రస్తావించాడట.

Image result for chandrababu working as political assistant to Rahul gandhi

అనంతరం ఢిల్లీ వచ్చిన బాబు, మాయవతి, అఖిలేష్ యాదవ్ వద్ద కూడా ఇదే పాట పాడినట్టు తెలిసింది. ప్రాంతీయ పార్టీల నేతలను కలిసి రాష్ట్రపతిని కలవాల్సిందేనని వారిపై ఒత్తిడి తీసుకొచ్చినట్టు తెలిసింది. అయితే ఇప్పటికే ఓటమి భయంతో కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్ మరియు ప్రాంతీయ పార్టీలు దాని గురించి ఆలోచించే పరిస్థితి లో లేవని ఢిల్లీవర్గాల నుంచి సమాచారం అందుతోంది.

Image result for chandrababu working as political assistant to Rahul gandhi

అయితే నారా చంద్రబాబు నాయుడు మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా మోడీ శత్రుపక్షాలు మరియు ప్రాంతీయ పార్టీలు అందరం కలసి రాష్ట్రపతిని కలుస్తామని అమరావతిలో వీధి వీధినా ప్రచారం చేస్తున్నారట. నరేంద్ర మోడీ ప్రధాని పీఠం ఎక్కకుండా తమ కూటమినే ప్రభుత్వ ఏర్పాటుకు పరిగణలోకి తీసుకోవాలని కోరబోతున్నా మని చెప్పడం విశేషం. దాన్నే ప్రధాన టిడిపి మద్దతు మీడియా అదేపనిగా ప్రచారం చేసుకుపోతోంది.

Image result for chandrababu working as political assistant to Rahul gandhi

నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రపతిని కలవాలన్న ప్రతిపాదనకు లెఫ్ట్ పార్టీలు కూడా సిద్ధంగా లేవు. దేశంలో నరేంద్ర మోడీ నాయకత్వంలోని బిజేపి అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్-పోల్స్ అన్నీ ఘంఠాపథంగా చెపుతున్న తరుణాన ఇదంతా వృథాప్రయాస అని మే 23 తర్వాత ఓట్ల లెక్కింపు ఆపై ఫలితాల ప్రకటన తరవాతే ఆలోచిద్దామనే ఆలోచనలో లెఫ్ట్ పార్టీలు, మమత బెనర్జీ, మాయావతి, అఖిలేష్  తో సహా అన్ని పార్టీలు అంటున్నాయి. అందుకే చంద్రబాబు ఐడియాను చెత్తబుట్టలో పడేయ డానికి  వారంతా సిద్ధం అయినట్టు తెలిసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: